భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భద్రతను అధికారులు పెంచారు. జైషే మహ్మద్‌కు చెందిన హిదాయత్ ఉల్లా మాలిక్ అనే ఉగ్రవాది నుంచి వీడియో స్వాధీనం చేసుకున్న అనంతరం డోభాల్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాదులు.. డోభాల్ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు ఆ వీడియోలో ఉంది.
అయితే.. రెక్కీ గతేడాది నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలను మాలిక్ రికార్డు చేసి.. పాకిస్థాన్‌లోని కొందరికి పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
2016 ఉరీ మెరుపు దాడులు, 2019 బాలాకోట్ వైమానిక దాడుల ప్రణాళికలో డోభాల్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే.. డోభాల్‌ను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్