అసోంలో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 27న జరుగనున్న ఈ ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయింది. అయితే మొదటి రోజు నామినేషన్లు ఏవీ దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు ఆఖరు తేది మార్చి 9. కాగా ధ్రువపత్రాల పరిశీలన మార్చి 10న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 12 చివరి తేదీ అని ఎన్నికల సంఘం తెలిపింది.
మొత్తం 3 దశలుగా అసోంలో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో మొదటి దశ(మార్చి27) 11జిల్లాలోని 47 నియోజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న, మూడో విడత ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. ఎన్నికల లెక్కింపు మే2న ఉంటుంది.
ఇదీ చూడండి: మోగిన ఎన్నికల నగారా- ఇక సమరమే!