Notification For Airport Metro Tender : హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టు మెట్రో టెండర్లకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మెట్రోకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ టెండర్లను పిలిచింది. రేపటి నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ తెలిపింది. ఈ బిడ్డింగ్‌కు జులై 5ను చివరి తేదీగా ప్రకటించింది. ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కాంట్రాక్టు విలువ రూ. 5,688 కోట్లుగా మెట్రో రైల్ లిమిటెడ్ నిర్ధారించింది.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు పునాది : అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని సీఎం కేసీఆర్ ఆలోచన.. ఆ ఆలోచనలో భాగంగా హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో ఉండాలని ఆలోచన చేసేవారు. నగరం నుంచి పర్యాటకులను, విదేశీయులను ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా విమానాశ్రయానికి చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ మెట్రో రెండో దశను 2018లో అధికారులకు సీఎం సూచించారు. అదే ఏడాది మార్చిలో హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు ఏఏ మార్గాల్లో వెళుతుంది: రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ మార్గానికి హెచ్ఏఎంఎల్ డీపీఆర్‌ను రూపొందించింది. నిధులు లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ఈ ఏడాది బడ్జెట్లో మెట్రోకు తగిన నిధులు కేటాయించడంతో ఆ ప్రాజెక్టు ఇప్పుడు శరవేగంగా దూసుకుపోనుంది. అందుకు సంబంధించి ఈ ఏడాది సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపి.. శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు టెండర్లు పిలవడంతో ఆ ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. మైండ్‌స్పేస్ కూడలి నుంచి 900 మీటర్లు దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌తో విమానాశ్రయ మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ.. కాజాగూడ చెరువు పక్క నుంచి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్ సమన్వయంతో ఎలైన్‌మెంట్ రూపొందించారు.
ప్రత్యేకతలివీ...
* విమానాశ్రయ మెట్రోలో ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు.
* ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా సీట్లు (ఛైర్‌కార్లు) ఉంటాయి.
* ప్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్‌ల తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి.
* రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి.
* కారిడార్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మిస్తారు. వాటికి ప్రయాణికులు చేరుకునేలా స్కైవాక్‌లు ఏర్పాటు చేస్తారు.
* స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తారు. సీఐఎస్‌ఎఫ్ పోలీసుల సమన్వయంతో లగేజీ తనిఖీలు చేస్తారు.
ఇవీ చదవండి: