వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. కరోనా వ్యాక్సిన్ తీసుకోబోమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రెండోవిడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. 60 ఏళ్లు దాటిన రైతులు టీకా తీసుకోవడానికి నిరాకరించారు.
కరోనావైరస్‌కు తాము భయపడమని.. టీకా తీసుకోమని అన్నదాతలు వెల్లడించారు. రైతు శిబిరాల్లో వ్యాక్సినేషన్‌ను తాము అడ్డుకోబోమని.. టీకా తీసుకోవడం వ్యక్తిగతమని వెల్లడించారు. అన్నదాతలు పొలాల్లో కష్టపడి పనిచేస్తారని, వారికి రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుందని రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 80 ఏళ్ల బల్బీర్ సింగ్ తెలిపారు. కొవిడ్ అంటే తనకు భయం లేదన్న బల్బీర్.. తనకు కరోనా టీకా అవసరం లేదని వెల్లడించారు.
కరోనా బారిన పడతామన్న భయం ఈ ఉద్యమం నుంచి తమ దృష్టిని మరల్చలేదని 75 ఏళ్ల జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ తెలిపారు.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక 'మ్యాప్‌లు'