జమ్ము కశ్మీర్లో స్థానికేతరులపై (Non locals killed in Kashmir) ఉగ్రవాదులు జరుపుతున్న వరుస దాడులు (Terror attack Kashmir) అక్కడి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం కశ్మీర్‌కు వచ్చిన కూలీలు ప్రస్తుత పరిస్థితులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. తమకూ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు, చిరు వ్యాపారులు తిరిగి తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. (Terror attack Kashmir today)
![kashmir news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13387294_jk-sri-01-labourersflee-pkg-7203376_18102021123841_1810f_1634540921_292-1.jpg)
ఇప్పటికే పదుల సంఖ్యలో కూలీలు శ్రీనగర్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఉగ్ర దాడులకు (Non locals killed in Kashmir) భయపడే వెళ్లిపోతున్నామని వీరంతా చెబుతున్నారు.
![kashmir news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13387294_jk-sri-01-labourersflee-pkg-7203376_18102021123841_1810f_1634540921_292-2.jpg)
"మాది రాజస్థాన్. రాజస్థాన్‌కే తిరిగి వెళ్లిపోతున్నాం. ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. బిహార్ కూలీలను (Non locals killed in Kashmir) చంపేశారు. అందుకే మాకు భయంగా ఉంది. మాకు పిల్లలు ఉన్నారు. అందుకే భయం.
విలేకరి: ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు?
జ: ప్రభుత్వం నుంచి మేమేం కోరుకుంటాం? మాకు జమ్ము వెళ్లిపోయేందుకు వాహనం కావాలి. అంతకుమించి ఏం అవసరం లేదు. మేం ఈ రోజే వెళ్లిపోవాలి. ఓ వైపు వర్షం పడుతోంది. మా ఇళ్లను కూడా విడిచిపెట్టి వచ్చేశాం."
-శాంతి దేవి, వలస కూలీ
పోలీసుల కళ్లుగప్పి...
ఇటీవల కశ్మీర్ లోయలో స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రదాడులు (Non locals killed in Kashmir) జరుగుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో ఐదుగురు స్థానికేతర కూలీలను గుర్తు తెలియని ఉగ్రవాదులు హత్య చేశారు. భద్రతా బలగాలతో తలపడకుండా.. నిరాయుధులైన స్థానికులపై దాడులు చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఇదే తరహా ఘటనలో బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. ఉగ్ర దాడుల వార్తలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని స్థానికేతర కూలీలు చెబుతున్నారు.
![kashmir news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13387294_jk-sri-01-labourersflee-pkg-7203376_18102021123841_1810f_1634540921_292-3.jpg)
"లాల్ చౌక్‌లో దుంపలు అమ్మేందుకు వచ్చాను. ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. రూ. 15-16 వేల సామగ్రి ఇక్కడే వదిలేసి వెళ్తున్నా. దాడుల గురించి వార్తల్లో విన్నా. ఇరుగుపొరుగు వాళ్లు కూడా చెప్పారు. ఇంట్లో వారు కూడా భయపడుతున్నారు. అందుకే వెళ్లిపోతున్నా."
-స్థానికేతర చిరు వ్యాపారి
"ఇక్కడి ప్రజలు ఏం అనట్లేదు. పోలీసులు మాత్రం మమ్మల్ని ఇంటి నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. కానీ, ఇక్కడ కూర్చొని మేమేం చేస్తాం. అందుకే ఇంటికి వెళ్తున్నాం."
-వలస కూలీ
భద్రత కట్టుదిట్టం
ఈ దాడుల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్థానికేతర వలస కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, సైనిక-ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులకు కూలీలను తరలించాలని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.. పది జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని అత్యవసర ఆదేశాలుగా పరిగణించాలని స్పష్టం చేశారు.
అయితే, స్థానికేతర కూలీలందరికీ భద్రత కల్పించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. చాలా మంది గ్రామాల్లో, చిన్న పట్టణాల్లోనూ ఉంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: