ఎస్సీ, ఎస్టీ రైతులు సహా వ్యవసాయదారుల రుణాల మాఫీ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. 2008నాటి 'వ్యవసాయ రుణాల రద్దు, రుణ ఉపశమన పథకం' తర్వాత రైతుల అప్పుల మాఫీకి సంబంధించి ఏ పథకాన్నీ కేంద్రం అమలుచేయలేదని లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
రైతుల సంక్షేమం కోసం, వారిపై రుణ భారాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు తీసుకున్న ప్రత్యేక చర్యలను మంత్రి వివరించారు. పంట రుణాలపై వడ్డీ తిరిగి చెల్లింపు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.6వేలు చొప్పున నేరుగా జమ చేయడం వంటి పథకాలను మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఇంకెన్నాళ్లీ రాష్ట్రాల సరిహద్దు వివాదాలు?