ETV Bharat / bharat

తాజ్ ​మహల్​లోని ఆ 22 గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు లేవా? - Taj Mahal containing idols of Hindu deities

Hindu Idols in Taj Mahal: ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్​ మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా భారత పురావస్తు శాఖ.. సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

No Hindu deity in Taj Mahal basement
No Hindu deity in Taj Mahal basement
author img

By

Published : Jul 3, 2022, 4:49 PM IST

Hindu Idols in Taj Mahal: తాజ్ ​మహల్​ నేలమాళిగలో(బేస్​మెంట్​) ఎలాంటి మూసిఉన్న గదులు కానీ, హిందూ దేవతల విగ్రహాలు కానీ లేవని స్పష్టం చేసింది భారత పురావస్తు శాఖ(ఏఎస్​ఐ). సమాచార హక్కు చట్టం(ఆర్​టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చింది.
తాజ్​మహల్​ నేలమాళిగలో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. చారిత్రక కట్టడంలోని మూసి ఉన్న 22 గదులను తెరవాలని.. అయోధ్య భాజపా మీడియా ఇంఛార్జ్ డా. రజనీశ్​ కుమార్​ 2022, మే 7న అలహాబాద్​ హైకోర్టులో పిటిషన్​ కూడా దాఖలు చేశారు. ఆ గదులు తెరిచేలా ఏఎస్​ఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆ వ్యాజ్యంలో కోరారు. అయితే.. మే 12న దీనిని తోసిపుచ్చింది ధర్మాసనం.

ఇది జరిగిన కొన్ని రోజులకు తృణమూల్​ కాంగ్రెస్​ ప్రతినిధి సాకేత్​ గోఖలే.. జూన్​ 21న ఆర్​టీఐ కింద ఏఎస్​ఐని కొన్ని ప్రశ్నలు అడిగారు. ''తాజ్​ మహల్ ఉన్న భూమి.. ఏదైనా ఆలయానికి చెందినదా? తాజ్​ మహల్​ నేలమాళిగలోని మూసి ఉన్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా?'' అని ప్రశ్నించారు. దీనికి బదులుగా.. మూసిఉన్న గదుల్లేవని, ఆ ప్రదేశమూ ఏ ఆలయానికి చెందినది కాదని స్పష్టం చేసింది ఏఎస్​ఐ. ​

ఇవీ చూడండి: 'తాజ్​మహల్ స్మారకం కాదు​ శివాలయం.. 22గదుల్లో హిందూ దేవుళ్లు?'

'తాజ్​మహల్​లో హిందూ దేవతా విగ్రహాలు' పిటిషన్ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.