ETV Bharat / bharat

'ఎన్​డీఏ, ఎల్​డీఎఫ్​ మధ్య అంతర్గత సంబంధాలు' - బంగారం స్మగ్లింగ్​ కేసులో సీఎం విజయన్​పై​ ఎఫ్​ఐఆర్​ నమోదు చేయకపోవడంపై కాంగ్రెస్​ విమర్శలు

భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏతో.. ఎల్​డీఎఫ్​కు​ అంతర్గత సంబంధాలున్నాయని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా అన్నారు. ఈ కారణంగానే.. బంగారం స్మగ్లింగ్​ కేసులో కేరళ సీఎం విజయన్​పై​ దర్యాప్తు సంస్థలు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం లేదని ఆరోపించారు.

ranadheep surjewala alleges nexus between BJP-led NDA and LDF govts
ఎన్​డీఏ, ఎల్​డీఎఫ్​ మధ్య అంతర్గత సంబంధాలున్నాయన్న కాంగ్రెస్
author img

By

Published : Mar 30, 2021, 7:22 AM IST

కేరళలో అధికార ఎల్​డీఎఫ్​పై కాంగ్రెస్​ విరుచుకుపడింది. భాజపా నాయకత్వం వహిస్తున్న ఎన్​డీఏతో ఎల్​డీఎఫ్​కు​ అంతర్గత సంబంధాలున్నాయని ఆరోపించింది. దీని కారణంగానే.. బంగారం స్మగ్లింగ్​ కేసులో సీఎం విజయన్​తో సహా ముగ్గురు మంత్రులు, స్పీకర్​​పై దర్యాప్తు సంస్థలు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదని పేర్కొంది.

"బంగారం స్మగ్లింగ్​ కేసుతో సీఎం విజయన్​ సహా ముగ్గురు మంత్రులు, స్పీకర్​లకు సంబంధాలున్నాయని ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ చెప్పారు. అయినా వారిపై చర్యలేమీ ​ తీసుకోలేదు. కానీ, విజయన్ మాజీ కార్యదర్శిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ప్రధాని మోదీతో విజయన్​కి ఉన్న అంతర్గత సంబంధాలే సీఎంపై దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్​ నమోదు చేయకుండా ఆపుతున్నాయి."

-రణదీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ఇదీ కేసు

గతేడాది జులై 5న తిరువనంతపురం విమానాశ్రయంలో.. యూఏఈ కాన్సులేట్​ కార్యాలయం బ్యాగేజీ నుంచి 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వప్న సురేశ్​ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. విజయన్​ మాజీ ప్రధాన కార్యదర్శి ఎమ్​ శివకుమార్​ను ఈ కేసులో అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఆయన బెయిల్​పై బయటకు వచ్చారు.

ఇదీ చదవండి: కేరళలో లవ్​ జిహాద్, శబరిమల అస్త్రాలతో భాజపా

For All Latest Updates

TAGGED:

dummy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.