ETV Bharat / bharat

'ఆర్​టీసీ వివాదంపై న్యాయపోరాటం చేయబోం' - కేరళ, కర్ణాటక కేఎస్‌ఆర్‌టీసీ వివాదం

కర్ణాటకతో ఆర్​టీసీ వివాదంలో ప్రత్యక్ష న్యాయ పోరాటం చేసే ఉద్దేశమేమీ లేదని కేరళ ఆర్టీసీ పేర్కొంది. రోడ్డు రవాణా సంస్థ సంక్షిప్తనామం(కేఎస్​ఆర్​టీసీ) పేరు, లోగోను ఉపయోగించే విషయంలో కేరళకు అనుకూలంగా ఇటీవలే తీర్పు వెలువడింది.

KSRTC's
కేఎస్​ఆర్​టీసీ
author img

By

Published : Jun 5, 2021, 4:37 PM IST

కర్ణాటక ప్రభుత్వంతో ఎలాంటి న్యాయ పోరాటానికి కేఎస్‌ఆర్‌టీసీ(కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) సిద్ధంగా లేదని ఆ సంస్థ సీఎండీ బిజు ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు కేరళ ఆర్టీసీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

'కేఎస్‌ఆర్‌టీసీ లోగో విషయంలో కర్ణాటకపై ఎలాంటి పోరాటం చేయబోము. ఈ సమస్యను సరైన పద్ధతిలో పరిష్కరించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అవసరమైతే.. కార్యదర్శి, మంత్రుల స్థాయిలో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయజేస్తాం' అని కేరళ ట్రాన్స్​పోర్ట్ ఫేస్​బుక్​ పోస్ట్ పేర్కొంది.

KSRTC's
కేఎస్​ఆర్​టీసీ
KSRTC's
కేఎస్​ఆర్​టీసీ ఫేస్​బుక్​ పోస్ట్

కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ప్రయాణ పరంగానే కాకుండా ఇతర అన్ని విషయాల్లోనూ సహకరించుకుంటున్నాయని, కాబట్టి.. ఈ సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని బిజు ప్రభాకర్ స్పష్టం చేశారు. ఏడు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం.. కేఎస్​ఆర్​టీసీ లోగో విషయంలో కేరళకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

ఇవీ చదవండి: ఆర్​టీసీల మధ్య వివాదం- ఆ రాష్ట్రానిదే విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.