ETV Bharat / bharat

'భారత్​-చైనా ఎఫ్​డీఐ నిబంధనలు యథాతథం' - విదేశీ పెట్టుబడులు చైనా

తూర్పు లద్ధాఖ్​లో బలగాల ఉపసంహరణ తర్వాత కూడా చైనాతో భారత్​కు ఉన్న ఎఫ్​డీఐ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. బలగాల ఉపసంహరణ తర్వాత.. చైనాపై ఆంక్షలను ఎత్తివేస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది.

No change in policy on Chinese FDI post disengagement
'భారత్​-చైనా 'ఎఫ్​డీఐ' నిబంధనల్లో మార్పు లేదు'
author img

By

Published : Feb 23, 2021, 5:24 PM IST

బలగాల ఉపసంహరణ తర్వాత చైనాతో భారత్​కు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ) నిబంధనలు అలాగే కొనసాగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన తొలగిపోనున్న నేపథ్యంలో భారత్​లో పెట్టుబడి పెట్టేందుకు చైనా కంపెనీలు తరలి వస్తాయని మీడియాలో వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు.

" చైనాతో భారత్​కు ఉన్న ఎఫ్​డీఐ నిబంధనల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. భవిష్యత్​లో రద్దు చేయాలన్న ప్రణాళిక సైతం మా వద్ద లేదు. ఎప్పటిలాగానే చైనా నుంచి వచ్చే కంపెనీలు భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. నిబంధనలు పాటించాలి. దేశ భద్రతకు ముప్పు లేదని భావించిన కంపెనీలకే కేంద్ర అనుమతి ఉంటుంది."

-- కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు

అయితే హాంకాంగ్​కు చెందిన సిటిజెన్​ వాచెస్​ కంపెనీ, జపాన్​కు చెందిన నిప్పన్​ పెయింట్స్​ కంపెనీకి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నెట్​ ప్లే అనే స్పోర్ట్స్​ కంపెనీకి సైతం కేంద్రం ఇటీవల అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి.

గల్వాన్​ ఘటన తరువాత చైనాపై ఎఫ్​డీఐ ఆంక్షలను కఠినతరం చేసింది భారత్​. చైనాకు చెందిన కంపెనీలు భారత్​లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.

ఫిబ్రవరి 10న భారత్- చైనా మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు డ్రాగన్ ప్రకటించగా.. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ వేదికగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఇదీ చదవండి : బలగాల ఉపసంహరణపై అమెరికా నిశిత పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.