ETV Bharat / bharat

'సాగు చట్టాలు భేష్​- 'దిల్లీ హింస' బాధాకరం' - president budget session speech

గణతంత్ర వేడుకల రోజు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను బలంగా సమర్థించారు. కరోనా సహా ప్రతి సమస్యను దేశం ఒక్కటిగా ఎదుర్కొందన్న రాష్ట్రపతి... ఏ సవాలు కూడా దేశాభివృద్ధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. గల్వాన్‌ ఘటనలో సైనికుల ప్రాణ త్యాగాలను గుర్తు చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

The national flag and a holy day like Republic Day were insulted in the past few days.
దేశాభివృద్ధిని ఏ సవాల్​ అడ్డుకోలేదు: రాష్ట్రపతి
author img

By

Published : Jan 29, 2021, 2:54 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 సాగు చట్టాలపై కొన్ని రైతు సంఘాలు కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా వాటిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బలంగా సమర్థించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయసభల సంయుక్త సమావేశంలో మాట్లాడిన రాష్ట్రపతి... సాగు చట్టాల వల్ల 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. అయితే సాగు చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిందని... సర్వోన్నత న్యాయస్థానం తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు పంటలకు కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో చెల్లిస్తున్నట్లు తెలిపారు.

మా ప్రభుత్వం స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తోంది. అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచుతోంది. మా ప్రభుత్వం కనీస మద్దతు ధర రికార్డు స్థాయిలో చెల్లిస్తోంది. పంట కొనుగోలు కేంద్రాలను కూడా పెంచింది. దేశ రైతుల ప్రయోజనాల కోసం మూడు వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చాం. ఈ మూడు సాగు చట్టాల ప్రయోజనాలను పది కోట్లమందికిపైగా సన్నకారు రైతులు పొందుతున్నారు. అనేక మంది రాజనీతిజ్ఞులు ఈ సాగు చట్టాలకు పూర్తి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ సాగు చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపేసింది. మా ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని గౌరవిస్తుంది. సుప్రీం ఆదేశాలను పాటిస్తుంది. ఈ మూడు చట్టాలపై నెలకొన్న ఆందోళనలను దూరం చేసేందుకు మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది.

-రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

హింస దురదృష్టకరం..

మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజు చెలరేగిన హింసను రాష్ట్రపతి తీవ్రంగా ఖండించారు. త్రివర్ణ పతాకం సహా గణతంత్ర దినోత్సవం లాంటి పవిత్రమైన రోజును అవమానించడం దురదృష్టకరమని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించే రాజ్యాంగమే... చట్టాలు, నిబంధనలను గట్టిగా పాటించాలని నేర్పిస్తుందని తెలిపారు.

విస్తృత చర్చ తర్వాత పార్లమెంటు 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మర్యాదను గౌరవించే కేంద్ర ప్రభుత్వం... ఈ చట్టాల విషయంలో ఉద్భవించిన భ్రమలను తొలగించేందుకు నిరంతరం ప్రయత్నించింది. ప్రజాస్వామ్యంలో ఉన్న భావప్రకటన స్వేచ్ఛను, శాంతిపూర్వక ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవించింది. కానీ ఇటీవల త్రివర్ణ పతాకం సహా గణతంత్ర దినోత్సవం లాంటి పవిత్రమైన రోజును అవమానించడం చాలా దురదృష్టకరం. మనకు భావప్రకటన స్వేచ్ఛ అధికారాన్ని ప్రసాదించే రాజ్యాంగమే చట్టాలు, నియమాలను కూడా అంతే గట్టిగా పాటించాలని మనకు నేర్పిస్తుంది.

-రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

ఐకమత్య శక్తి

పెద్ద పెద్ద సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనడం ద్వారా ఐకమత్యంలో ఉన్న శక్తిని భారత్ మరోసారి ప్రపంచానికి చాటిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. దేశ ప్రజలు ఒక్కటై ముందుకు సాగితే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా నిరూపించామని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ప్రతి సమస్యను దేశం ఒక్కటిగా ఎదుర్కొందన్న రాష్ట్రపతి... ఏ సవాలు కూడా దేశాభివృద్ధిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం రెండు స్వదేశీ తయారీ వ్యాక్సిన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిచేపట్టడం గర్వకారణమని రాష్ట్రపతి గుర్తుచేశారు.

ఓవైపు కరోనావంటి మహమ్మారి, మరోవైపు పలు రాష్ట్రాల్లో వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో భూకంపాలు, పెద్ద పెద్ద తుపాన్లు, దాడుల నుంచి బర్డ్‌ ఫ్లూ వరకు... దేశ ప్రజలు అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా.. దేశం సహా ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ప్రభావితమయ్యారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత సామర్థ్యం మరోసారి బయటకు వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న సమయానకూల చర్యల కారణంగా లక్షలాది మంది పౌరుల ప్రాణాలకు ముప్పు తప్పిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు సంఖ్య చాలా వేగంగా తగ్గుతోంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

-రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

గత ఏడాది జూన్‌లో గల్వాన్‌లో 20 మంది భారత సైనికులు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారన్న రాష్ట్రపతి... వారిపట్ల ప్రతి భారతీయుడు కృతజ్ఞత కలిగి ఉంటారన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు.

బహిష్కరించిన పార్టీలు..

రాష్ట్రపతి ప్రసంగాన్ని దాదాపు 20 విపక్ష పార్టీలు బహిష్కరించాయి. రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ జై జవాన్‌, జై కిసాన్‌ అంటూ నినాదాలు చేశారు. సాగు చట్టాలు రద్దు చేయాలని నినదించారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ గ్యాలరీలో విపక్ష పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: 13 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు​ హత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.