నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా నివర్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు మామల్లపురంలో భీకరగాలులు వీస్తున్నట్లు తెలిపింది. కడలూరుకు 180 కి.మీ, పుదుచ్చేరికి 190 కి.మీ. దూరంలో 'నివర్' కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. గంటకు 11 కి.మీ. వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ వివరించింది.
3 రాష్ట్రాలకు 25 బృందాలు..
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_3.png)
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_2.png)
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_1.png)
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_4.png)
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_9.jpg)
'నివర్ తుపాను నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉండనున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లకు 25 బృందాలను పంపించినట్లు తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్. కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారని.. రెండు రోజులుగా క్షేతస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు.
సురక్షిత ప్రాంతాలకు..
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_7.jpg)
![nivar toofan latest updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9661385_8.jpg)
తరలింపు..
'నివర్' దృష్ట్యా.. ముప్పు ముంగిట ఉన్న తమిళనాడులోని దాదాపు 30 వేల మంది, పుదుచ్చేరిలోని 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాన్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు కలిసి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నష్టాన్ని వీలైనంతగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : మరికొద్దిగంటల్లో పెనుతుపానుగా 'నివర్'