ETV Bharat / bharat

మార్చి నుంచి GPS విధానంలో టోల్ ఛార్జ్​లు- ట్రాఫిక్​ను తగ్గించేందుకే! - ఇండియాలో ఫాస్టాగ్ విధానం

Nitin Gadkari On Toll Tax : జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలుకు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడం సహా జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Nitin Gadkari On Toll Tax
Nitin Gadkari On Toll Tax
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 7:48 AM IST

Updated : Dec 21, 2023, 8:22 AM IST

Nitin Gadkari On Toll Tax : జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలుకు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. దీని వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడం సహా జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ విధానం అందుబాటులోకి వచ్చాక టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌ నంబర్‌ప్లేట్‌ రీడర్లను ఏర్పాటు చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు.

2018-19లో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండేదని, ఫాస్టాగ్‌ను అమల్లోకి తెచ్చాక ఆ సమయం 47 సెకన్లకు తగ్గిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే లోపు బిల్డ్‌- ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్ల రోడ్ల ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు.

First Electric Highway In India : నాగ్‌పుర్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్నాళ్ల క్రితం తెలిపారు. విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని దిల్లీలో జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో గడ్కరీ తెలిపారు. పైగా ఈ తరహా రహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్‌ను ఇవ్వడం విద్యుత్‌ మంత్రిత్వ శాఖకూ పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు.

విద్యుత్ రహదార్లు అంటే..
విద్యుత్‌ రైళ్ల పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన విద్యుత్‌ సరఫరా తీగలు ఉంటాయో ఆ తరహాలోనే రహదారులపైనా తీగలను అమరుస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే విద్యుత్‌ సాయంతో రహదారులపై నడుస్తాయి. ఆ విధంగా వాహనాల్లోనూ, విద్యుత్‌ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.

మూడు క్రిమినల్​ బిల్లులకు లోక్​సభ ఆమోదం- బ్రిటిష్ కాలంనాటి సెక్షన్లకు చెక్!

'ప్రతి 3 నెలలకోసారి మాక్ డ్రిల్​'- కొవిడ్ కేసులపై కేంద్రం అలర్ట్

Last Updated : Dec 21, 2023, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.