ETV Bharat / bharat

కన్నతండ్రుల రాక్షసత్వం.. ఒకరేమో కూతురిపై అత్యాచారం.. మరొకరు అమ్మేందుకు యత్నం - ఉత్తర్​ప్రదేశ్​ కుమారైపై తండ్రి అత్యాచారం కేసు

కన్న కూతురిపై అత్యాచారం జరిగితే ఏ తండ్రి అయినా.. నిందితులకు శిక్షపడేలా చేసేందుకు పోరాడతాడు. కానీ ఓ మానవమృగం మాత్రం తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని విషయాన్ని తెలుసుకుని.. దాన్ని అలుసుగా తీసుకుని తాను కూడా అత్యాచారం చేశాడు. ఈ అవమానకరమైన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మరో ఘటనలో కన్నతండ్రే కూతురిని అమ్మేందుకు ప్రయత్నించాడు.

minor girl gang rape in kochi
తన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి
author img

By

Published : Nov 17, 2022, 10:47 PM IST

కేరళలో ఉద్యోగం ఇస్తానని నమ్మించి కొందరు దుండగులు ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ అమ్మాయిని మరొకరికి అమ్మేశారు. అదృష్టవశాత్తు వారి నుంచి తప్పించున్న ఆ బాలిక​ ఇంటికి చేరుకుని అసలు విషయాన్ని బయటపెట్టింది. కుటుంబ సభ్యుల సాయంతో తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఓ మహిళతో పాటు తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. మరో 12 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ 17ఏళ్ల బాలిక​ ఆగస్టులో త్రిస్సూర్​లోని తన ఇంటి నుంచి పారిపోయి.. కొచ్చి నగరానికి చేరుకుంది. అయితే అక్కడ తనకి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులను కూడా పిలిచి ఆ అమ్మాయిపై అత్యాచారం చేయించాడు. అక్కడితో ఆగకుండా.. ఆ లాడ్జి యజమాని సహా అక్కడ పనిచేసే ఉద్యోగి కూడా బాలికపై అత్యాచారం చేశారు. ఆ బాలికకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి కొన్ని నెలల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత నిందితులు పలారివట్టంలో ఓ మహిళకు ఆ బాలికను అప్పగించారు. అనంతరం ఆ మహిళ.. బాలికను వ్యభిచార గృహానికి సంబంధించిన కొందరు వ్యక్తులకు అప్పగించింది. అయితే ఆ బాలిక వారి నుంచి తప్పించుకుని త్రిస్సూర్​లోని తన ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపి.. వారి సహాయంతో ఎర్నాకులం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక మహిళతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో 12 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు.

17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కన్న తండ్రి..
తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక​పై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై తండ్రి, మామ అత్యాచారం పలు సార్లు అత్యాచారం చేయగా.. తాత కూడా వేధింపులకు గురిచేశాడని ఆ మైనర్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక తన కుటుంబసభ్యులు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాలిక పుణెలోని ఓ కళాశాలలో చదువుకుంటోంది. బుధవారం ఆ కాలేజీలో విశాఖ కమీటీ వారు మహిళలపై జరిగే అఘూయిత్యాల గురించి ఓ ప్రత్యేక కార్యాక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి వారికి చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

బాలిక 2016లో తన స్వగ్రామంలో ఉన్నప్పుడు తన మామ పలుమార్లు అత్యాచారం చేశాడని.. తాత కూడా లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించింది. 2018లో పుణెలోని ఓ కళాశాలలో చేరిన తరవాత తన తండ్రికి ఈ విషయం చెప్పింది. అయితే తన తండ్రి ఆ దుండగులుపై చర్యలు తీసుకోకుండా.. ఇంట్లో తన తల్లి లేని సమయంలో తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. బాలిక తండ్రిని అరెస్ట్​ చేశారు. విచారణను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

కన్న కూతుర్ని అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు చెందిన ఓ మహిళ.. తాను ముగ్గురు అమ్మాయిలను జన్మనిచ్చినందుకు అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముగ్గురు కూతుర్లలో ఒకరిని రూ.10,000కు అమ్మేందుకు తన భర్త ప్రయత్నించాడని ఆరోపించింది.

పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఓ మహిళ తన అత్తంటివారు చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. తనకు దిల్లీలో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత తనకు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారని, దీంతో అత్తింటివారు తనను విపరీతంగా కొట్టేవారని వెల్లడించింది. ఇంకా తన అత్త, భర్త కలిసి రెండేళ్ల వయసున్న రెండో చిన్నారిని రూ.10 వేలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనని కర్రతో రక్తం వచ్చేలా కొట్టినట్లు పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.