ETV Bharat / bharat

డ్రగ్స్​ దందాలో 'సింగం' నటుడు అరెస్టు - కాడుగూండనహళ్లి

నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్​విమ్​ మాల్విన్​ను​ డ్రగ్స్​ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పలువురికి డ్రగ్స్​ విక్రయిస్తుండగా.. అతడ్ని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కన్నడ, హిందీ, తమిళ భాషల సినిమాల్లో అతడు నటించాడు.

Chakwim Malvin
చాక్​విమ్​ మాల్విన్
author img

By

Published : Sep 29, 2021, 8:16 PM IST

Updated : Sep 29, 2021, 9:58 PM IST

తమిళ నటుడు 'సూర్య' హీరోగా నటించిన 'సింగం' సినిమాలో కనిపించిన నైజీరియన్​ దేశస్థుడు, నటుడు చాక్​విమ్​ మాల్విన్..​ డ్రగ్స్​ కేసులో కర్ణాటక పోలీసులకు చిక్కాడు. బెంగళూరు కాడుగూండనహళ్లి పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్​ ఆయిల్​ సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పలు సినిమాల్లో..

చాక్​విమ్ కన్నడ సహా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కనిపించాడు. అన్నబాండ్​, పరమాత్మ వంటి 20 కన్నడ సినిమాల్లో, తమిళ్​లో సింగం, విశ్వరూపం సినిమాల్లో నటించి మెప్పించాడు.

Chakwim Malvin
చాక్​విమ్​ మాల్విన్
Chakwim Malvin
బాలీవుడ్ నటుడు రణ్​బీర్​ కపూర్​తో చాక్​విమ్​ మాల్విన్​

ముంబయిలో యాక్టింగ్​లో శిక్షణ

మెడికల్​ వీసాపై భారత్​కు వచ్చిన చాక్​విమ్​... ముంబయిలోని న్యూయార్క్​ ఫిల్మ్​ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతకుముందు.. 2006లో అతడు ఆరు నెలలపాటు నైజీరియా రాజధాని అబుజాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలోనూ శిక్షణ తీసుకున్నాడు.

రెడ్​హ్యాండెడ్​గా దొరికాడు..

లాక్​డౌన్​ సమయంలో సినిమా అవకాశాలు రాకపోగా... చాక్​విమ్​ డ్రగ్స్​ అమ్మకాలు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. కళాశాల విద్యార్థులు, వ్యాపారులకు అతడు డ్రగ్స్​ సరఫరా చేశాడని తెలిపారు. ఆఫ్రికా నుంచి అక్రమంగా తరలించిన డ్రగ్స్​ను అతడు విక్రయించేవాడని పేర్కొన్నారు. కాడుగూండనహళ్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో మత్తుపదార్థాలను విక్రయిస్తుండగా తాము రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నామని వెల్లడించారు.

ఎవరెవరితో సంబంధం ఉంది?

చాక్​విమ్​ ఎన్నేళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నాడు? అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? ఈ వ్యవహారంలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: TOLLYWOOD DRUGS CASE: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేస్తారా..?

Last Updated : Sep 29, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.