ETV Bharat / bharat

NIA Raids Today : ఖలిస్థానీ శక్తులపై NIA ఉక్కుపాదం.. ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో సోదాలు - జాతీయ దర్యాప్తు సంస్థ ఖలిస్థానీ

NIA Raids Today : ఖలిస్థాన్‌ వేర్పాటువాద శక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా ఖలిస్థాన్‌ మద్ధతుదారులను అణిచివేసే లక్ష్యంతో పెద్దఎత్తున సోదాలు చేస్తోంది. మూడు కేసులకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో.. దాడులు నిర్వహిస్తోంది. లారెన్స్, బాంబిహా, అర్ష డాలా ముఠాలను NIA లక్ష్యంగా చేసుకుంది.

NIA Raids Today
NIA Raids Today
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 10:09 AM IST

Updated : Sep 27, 2023, 11:35 AM IST

NIA Raids Today : వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్‌ విషయంలో భారత్‌-కెనడా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. దేశంలో ఆ సంస్థకు మద్దతిస్తున్న ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA కొరడా ఝుళిపిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో ఖలిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులను లక్ష్యంగా చేసుకుని సోదాలు జరుపుతోంది. బుధవారం తెల్లవారుజామున నుంచే NIA బృందాలు ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో దాడులకు దిగాయి. పంజాబ్ మోగా జిల్లాలోని టఖ్తుపురా గ్రామంలో మద్యం కాంట్రాక్టర్‌ ఇంట్లో సోదాలు చేశాయి. ఖలిస్థాన్‌ మద్ధతుదారుడు అర్ష్‌ డాలా డిమాండ్‌ మేరకు ఆ కాంట్రాక్టర్ కొంత మొత్తం డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. ఈ విషయమై NIA దర్యాప్తు చేస్తోంది.

  • #WATCH | Punjab: NIA raids underway in Faridkot

    The National Investigation Agency (NIA) is conducting searches at 51 locations across the country in three separate cases linked to terror-gangster-smuggler nexus. pic.twitter.com/xypCg0JqJ7

    — ANI (@ANI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

NIA Raids Gangsters : ఉత్తరాఖండ్‌.. ఉధమ్‌సింగ్ నగర్‌లోని బాజ్​పుర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఉన్న గన్​హౌస్​లో NIA అధికారులు సోదాలు చేపట్టారు. దెహ్రాదూన్ జిల్లాలోని క్లెమన్‌టౌన్‌ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఇంట్లో, హరియాణాలోని నాలుగు ప్రాంతాల్లో NIA అధికారులు సోదాలు జరిపారు. ఆయా ఇళ్లలో తుపాకులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. కెనడాకు చెందిన తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న ముఠాలకు చెందిన 43 మంది వ్యక్తులపైనా NIA దృష్టి పెట్టింది. ఈ మేరకు వారి వివరాలను ఫొటోలతో సహా వెల్లడించిన NIA.. కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఆయా వ్యక్తుల ఆస్తులు, ఆదాయాల వివరాలు ఇవ్వాలని ప్రజలను కోరింది.

'ప్రజలారా.. ఆ వివరాలు ఇవ్వండి..'
గ్యాంగ్‌స్టర్లు... లారెన్స్‌ బిష్ణోయ్‌, జస్‌దీప్‌ సింగ్‌, కాలా జతేరి అలియాస్‌ సందీప్, వీరేందర్ ప్రతాప్‌ అలియాస్‌ కాలా రాణా, జోగిందర్ సింగ్‌ల చిత్రాలను.. ఇటీవల NIA ఎక్స్‌(ట్విట్టర్​)లో పోస్ట్ చేసింది. వారి పేరుతోగానీ, వారి అనుచరుల పేరిటగానీ ఉన్న ఆస్తులు, వ్యాపారాలు, వారి వ్యాపార భాగస్వామ్యులు, వారి కోసం పనిచేసే ఉద్యోగులు, కలెక్షన్‌ ఏజెంట్ల వివరాలను తమకు తెలపాలని ప్రజలను కోరింది. చండీగఢ్​, అమృత్‌సర్‌లో ఖలిస్థాన్‌ తీవ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నుకు చెందిన ఆస్తులను.. ఇప్పటికే NIA జప్తు చేసింది.

  • #WATCH | Police in Ferozepur take a man into custody as NIA raids are underway at various locations of associates of Canada-based terrorist Arshdeep Singh Dala in Punjab pic.twitter.com/xRvqiMg7pr

సెప్టెంబర్​ 21వ తేదీన పంజాబ్‌, హరియాణాల్లోని వెయ్యి ప్రాంతాల్లో సోదాలు చేసిన NIA.. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌కు చెందిన ఆస్తులపై గురిపెట్టింది. NIA వెతుకుతున్న మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో గోల్డీ బ్రార్ ఒకడు. కెనడాలోని విన్నీపెగ్‌ నగరంలో.. ఇటీవల హత్యకు గురైన మరో గ్యాంగ్‌స్టర్ సుఖా దునికే హత్యలో.. గోల్డీ బ్రార్‌ ప్రమేయం ఉన్నట్లు NIA అనుమానిస్తోంది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో NIA పోస్ట్ చేసిన చిత్రాల్లో ఉన్న చాలా మంది గ్యాంగ్‌స్టర్లు.. కెనడా నుంచి కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఖలిస్థాన్‌ గ్యాంగ్‌స్టర్లు, సానుభూతిపరులతో సంబంధాలు ఉన్నాయి. 2018లోనే 9 మంది ఖలిస్థాన్‌ సభ్యుల పేర్ల జాబితాను కెనడాకు భారత్‌ అందించింది.

దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఆ గ్యాంగ్​స్టర్లే టార్గెట్!

ఆరు రాష్ట్రాల్లో ఎన్​ఐఏ సోదాలు.. ఐసిస్​తో లింకులు ఉన్నవారే టార్గెట్!

Last Updated : Sep 27, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.