ETV Bharat / bharat

దేశంలో ఉగ్రదాడికి భారీ కుట్ర.. 28మంది అనుమానితుల అరెస్ట్​

NIA Raids Today: ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) జోరు పెంచింది. జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సోపోర్‌, కుప్వారా, షోపియాన్‌, రాజౌరీ, బుద్గాం, గందర్‌బల్‌, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక విషయాలను వెల్లడించింది.

author img

By

Published : Feb 19, 2022, 6:01 PM IST

NIA Raids Today
ఎన్​ఐఏ రైడ్స్​

NIA Raids Today: భారత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడేందుకు ఉగ్రమూకలు చేస్తున్న కుట్ర బహిర్గతమైంది. ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని 8 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సోదాల్లో ముఖ్యమైన పత్రాలు, సిమ్‌కార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లు, డిజిటల్ స్టోరేజీ పరికరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నఎన్​ఐఏ భారీ కుట్ర కోణాన్ని గుర్తించింది. ఉగ్రవాదుల పడగలో దిల్లీ ఉన్నట్లు హెచ్చరించిన ఎన్​ఐఏ.. దాడుల కుట్ర కొంతకాలంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. దిల్లీ, జమ్ముకశ్మీర్‌ సహా అనేక ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నాయని వెల్లడించింది.

భారీ దాడుల కోసం అనేక తీవ్రవాద సంస్థలు కలిసికట్టుగా ప్రణాళిక రచిస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ బదర్, పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థలు కలిసి దేశంలో భారీ దాడులకు కుట్ర పన్నాయని హెచ్చరించింది. జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌, కుప్వారా, షోపియాన్‌, రాజౌరీ, బుద్గాం, గందర్‌బల్‌ తో పాటుగా రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఎన్​ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురిపై నిఘా పెంచడంతో కీలక సమాచారం లభ్యమైందని తెలిపింది. ఈ సోదాల్లో అనేక విషయాలు బయటపడుతున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదుల కుట్ర కేసులో ఇప్పటికే 28 మంది నిందితులను అరెస్టు చేశామని వెల్లడించింది. కేసు విచారణ కొనసాగుతోందని.. వాగ్మూలం నమోదు కోసం కొందరికి, విచారణ కోసం మరికొందరికి త్వరలో నోటీసులు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులుగా గుర్తించిన వారిలో కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.

దావూద్​తో కలిసి..

దావూద్, డి కంపెనీ వ్యవహారంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, కొద్దిమంది రాజకీయ నేతలు ఎన్​ఐఏ రాడార్​లో ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం అవుతున్న నేపథ్యంలో త్వరలో అనేక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దావూద్​తో కలిసి దేశంలో కుట్రలకు పాల్పడిన వ్యవహారంలో అనేకమంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో సంబంధాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, మహారాష్ట్రలకు చెందిన కొందరు పెద్ద నాయకుల ఆదేశం మేరకే దావూద్ ఇబ్రహీం అనుచరులు అనేకమందికి సహాయం చేశారని అధికారిక వర్గాలు తెలిపాయి.

అండర్ వరల్డ్ డాన్, కొందరు ఉన్నత స్థాయి గ్యాంగ్‌స్టర్ల ఆదేశానుసారం కుట్రలకు పాల్పడేందుకు సహాయం చేశారని ప్రాథమిక సమాచారం అందిందని ఎన్​ఐఏ తెలిపింది. ఉగ్రవాదులకు వ్యాపారవేత్తలు నిధులు సమకూర్చి, ఆ ముఠాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొంది.

ఇదీ చూడండి: 'లష్కరే' ముఠాకు రహస్య పత్రాలు- ఐపీఎస్ అధికారి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.