ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఆ గ్యాంగ్​స్టర్లే టార్గెట్! - nia raids on gangsters houses

గ్యాంగ్‌స్టర్ల ఆటకట్టించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం దేశవ్యాప్తంగా భారీస్థాయిలో దాడులు చేపట్టింది. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసు దర్యాప్తులో భాగంగా హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌, దిల్లీ రాష్ట్రాల్లో స్థానిక పోలీసుల సహకారంతో పలువురు గ్యాంగ్‌స్టర్లకు చెందిన స్థావరాల్లో సోదాలు నిర్వహించింది. సిద్ధూ హత్యకేసులో ఉగ్రముఠాలతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

NIA Raids
NIA Raids
author img

By

Published : Sep 12, 2022, 11:57 AM IST

Updated : Sep 12, 2022, 12:10 PM IST

NIA Raids : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్​ఐఏ పలు రాష్ట్రాల్లో సోమవారం భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. మొత్తం 60 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. సిద్ధూ హత్యలో ఉగ్రముఠాల హస్తం ఉందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తోంది. హరియాణా, పంజాబ్‌ సహా దిల్లీ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌లో గ్యాంగ్​స్టర్లు గోల్దీ బ్రార్​, లోరిస్​ బిష్ణోయ్​, భగవాన్​ పురియా ఇళ్లపై ఎన్​ఐఏ దాడులు నిర్వహించింది. కోటక్​పురా, ఫరీద్​ కోట్​, రాజ్​పురాలోని పలువురు గ్యాంగ్​స్టర్ల్ ఇళ్లపై ఎన్​ఐఏ దాడులు నిర్వహిస్తోంది. సిద్ధూ హత్యకేసులో ఉగ్రముఠాలతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

NIA Raids :
గ్యాంగ్​స్టర్ల ఇళ్ల వద్ద ఎన్​ఐఏ సోదాలు

నీరజ్ బవానా, అతడి గ్యాంగ్‌.. ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నట్లు, సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఎన్ఐఏ చెబుతోంది. ప్రస్తుతం నీరజ్‌ గ్యాంగ్‌కు, లారెన్స్‌ బిష్ణోయ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూసేవాలా హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి లారెన్స్‌ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా ప్రకటించారు. లారెన్స్‌, గోల్డీ బ్రార్ సహా పలువురు గ్యాంగ్‌స్టర్లు దేశంలోని పలు జైళ్లతో పాటు, కెనడా, పాకిస్థాన్‌, దుబాయ్‌ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

NIA Raids :
గ్యాంగ్​స్టర్ల ఇళ్ల వద్ద ఎన్​ఐఏ సోదాలు

సిద్ధూను హత్యచేసిన వారిలో చివరి షూటర్‌ దీపక్‌ ముండీతోపాటు అతని ఇద్దరు సహాయకులను బంగాల్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు నేపాల్ పారిపోతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మెుత్తం 35 మంది నిందితుల్లో 23మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. నలుగురు విదేశాల్లో ఉన్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Singer Sidhu Moosewala Case : మే29న సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా దారిలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి.. సిద్ధూపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అయితే గ్యాంగ్‌స్టర్‌ గొడవలు, హత్యల కారణంగానే సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారి వీకే బవ్రా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గతేడాది అకాలీదళ్ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో మూసేవాలా మేనేజర్ పేరును లాగడం వల్ల సిద్ధూపై కక్షగట్టిన దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సిద్ధూ అంత్యక్రియలు వేల మంది అభిమానుల మధ్య జరిగాయి. సిద్ధూ సొంత గ్రామమైన మాన్సా జిల్లాలోని మూసాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇవీ చదవండి: నడిరోడ్డుపై బైసన్‌ ​గేదె బీభత్సం.. ఒక్కసారిగా ఆటోను పైకి లేపి..

కత్తి సాముతో అబ్బురపరుస్తున్న ఆరేళ్ల చిన్నారి.. చూస్తే వావ్​ అనాల్సిందే!

Last Updated : Sep 12, 2022, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.