ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అనే ఉగ్రవాదికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ముస్లిం యువతను పెద్దమొత్తంలో చేర్చుకుని భారత్‌లో తమ కార్యకలాపాల్ని విస్తరించుకోవడానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రకేసులో ఇతనికి సంబంధం ఉన్నట్లు తేల్చింది.
ఈ కుట్ర వల్ల పెద్ద మొత్తంలో యువత, గ్రూపులు, భారత్‌ను వీడి ఐసిస్‌లో చేరడానికి సంఘీభావం తెలిపారని పేర్కొంది.
ఐఎస్ఐఎస్కు సంబంధించిన కీలక వ్యక్తి షఫీ అర్మర్ అనే ఉగ్రవాదితో ఇతనికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేల్చింది. ఐసిస్ ఉగ్రకార్యకలాపాల్ని విస్తరించడానికి, బాంబు దాడులు చేయడానికి షఫీ అర్మర్ సహచరుడు ముదాబ్బీర్ ముస్తఖ్ షేక్నుంచి రూ.50,000 తీసుకున్నాడని వెల్లడించింది. ఈ కారణాల వల్ల 2015, డిసెంబర్ 9లో ఇమ్రాన్ ఖాన్ పఠాన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి: కశ్మీర్లో మరో ఉగ్రకుట్ర భగ్నం