ETV Bharat / bharat

'పుల్వామా దాడి' నిందితుడు అరెస్ట్.. జైషే సంస్థతో కుట్ర! - జమ్ము ఉగ్రవాది అరెస్ట్

NIA arrest terrorist: ఇటీవల జమ్మూలో జరిగిన పుల్వామా తరహా ఉగ్రదాడికి సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ ముష్కరుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ దాడికి పాల్పడిన నిందితులతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పాక్​లోని జైషే సంస్థతో మంతనాలు జరుపుతున్నాడని చెప్పారు.

NIA arrests key accused in Sunjwan terror attack case

author img

By

Published : May 26, 2022, 9:13 PM IST

NIA arrest terrorist: జమ్మూలో ఏప్రిల్​లో జరిగిన పుల్వామా తరహా ఉగ్రదాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. నిందితుడి పేరు అబిద్ అహ్మద్ మీర్ అని అధికారులు తెలిపారు. పుల్వామాలోని పుత్రిగామ్​లో నివసిస్తున్న ఇతడు.. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు అండర్​గ్రౌండ్ వర్కర్​గా పనిచేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో అరెస్టైన బిలాల్ అహ్మద్ వాగేకు మీర్ సన్నిహితుడని తెలిపారు. పాకిస్థాన్​లోని జైషే ఉగ్రవాదులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దాడి విషయంలో ఇతర నిందితులకు మీర్ సహకరించాడని ఎన్ఐఏ ప్రతినిధి వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటనకు రెండ్రోజుల ముందు సీఐఎస్​ఎఫ్ వాహనంపై సంజ్వాన్​లో దాడి చేశారు ఉగ్రవాదులు. బలగాలు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు.

ఇదీ చదవండి: బన్​లో క్రీమ్​ లేదని.. బేకరీ యజమానిపై కస్టమర్ల దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.