ETV Bharat / bharat

Akash Prime Missile: 'ఆకాశ్ ప్రైమ్' పరీక్ష విజయవంతం - డీఆర్​డీఓ కొత్త క్షిపణి

ఆకాశ్​ క్షిపణిలోని(Akash Prime Missile) సరికొత్త వెర్షన్​ను విజయవంతంగా పరీక్షించింది భారత్. ఒడిశా చాందీపుర్​లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ 'ఆకాశ్​ ప్రైమ్'​ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO New Missile) పేర్కొంది.

Akash Prime
ఆకాశ్ ప్రైమ్
author img

By

Published : Sep 28, 2021, 5:23 AM IST

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని(Akash Prime Missile) సరికొత్త వెర్షన్‌ను భారత్‌ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి పరీక్షించారు. ఈ క్షిపణికి 'ఆకాశ్‌ ప్రైమ్‌'(Akash Prime Missile range) అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో అది గగనతలంలో నిర్దేశించిన ఒక మానవరహిత విమానాన్ని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది.

  • #WATCH | A new version of Akash Missile – ‘Akash Prime’ successfully tested from Integrated Test Range (ITR), Chandipur, Odisha today. It intercepted & destroyed an unmanned aerial target mimicking enemy aircrafts, in its maiden flight test after improvements

    Video source: DRDO pic.twitter.com/Mx1RPBIKla

    — ANI (@ANI) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రస్తుతమున్న ఆకాశ్‌ క్షిపణితో పోలిస్తే.. 'ప్రైమ్‌' వెర్షన్‌లో దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. ఇంకా అనేక అంశాల్లో ఈ అస్త్రాన్ని ఆధునికీకరించారు. దీనివల్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే శీతల వాతావరణాన్ని కూడా ఇది సమర్థంగా తట్టుకొని, మంచి పనితీరును కనబరుస్తుంది" అని ఓ అధికారి తెలిపారు. తాజా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)(DRDO News), సైన్యం, వైమానిక దళం, ఇతరులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఈ అస్త్రం వల్ల.. ఆకాశ్‌ వ్యవస్థపై సైన్యం, వైమానిక దళాల విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:DRDO news: బ్రహ్మోస్‌ రహస్యాలు లీకయ్యాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.