మహమ్మారి విజృంభణతో అతలాకుతలమైన కేరళలో కరోనా కేసులు(Kerala Covid Cases) కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అక్కడ కొత్తగా 11,699 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 58మంది మరణించారు. మరో 17,763 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్తగా 209 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 225 మంది కోలుకోగా, సున్నా మరణాలు నమోదయ్యాయి.
- తమిళనాడులో కొత్తగా 1,657 కేసులు నమోదయ్యాయి. 1,662 మంది కోలుకోగా, 19 మంది మృతిచెందారు.
- గోవాలో కొత్తగా 50కేసులు బయటపడ్డాయి. 106మంది డిశ్చార్జ్ కాగా, ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
- కర్ణాటకలో కొత్తగా 504 కేసులు నమోదు కాగా.. 893మంది డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతిచెందారు.
- గుజరాత్లో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
వ్యాక్సినేషన్..
దేశంలో కరోనా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం నాటికి 86 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే కోటిమందికి టీకా అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: