ETV Bharat / bharat

35ఏళ్ల తర్వాత ఆడపిల్ల జననం- హెలికాప్టర్​లో ఇంటికి

ఈ రోజుల్లో ఆడపిల్లలంటే చిన్నచూపు! భారంగా భావిస్తారు! ఎవరికైనా ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే.. నిట్టూర్పుగా ఆడపిల్లా అంటారు! అయితే అందుకు భిన్నంగా.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకుందో కుటుంబం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుక నిర్వహించింది. రూ.4.5 లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్​లో ఇంటికి తీసుకొచ్చింది. బ్యాండ్​బాజాలు, ఆటపాటలతో ఆ ఊరంతా ఘన స్వాగతం పలికింది. ఈ తంతు రాజస్థాన్​లో జరిగింది.

New born baby
ఆడపిల్ల
author img

By

Published : Apr 23, 2021, 2:54 PM IST

ఆడపిల్లకు ఘన స్వాగతం

ఆడ పిల్ల అని తెలిస్తే పుట్టుక ముందే ప్రాణాలు తీస్తున్న రోజులివి! అలాంటిది.. తమ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని.. సంబరాలు చేసుకుంది రాజస్థాన్​ నాగౌర్​ జిల్లాకు చెందిన ఓ కుటుంబం.

35ఏళ్ల తర్వాత

జిల్లాలోని నింబ్డి చాందవతా గ్రామానికి చెందిన మదన్​లాల్​ కుమార్ కుటుంబంలో రెండు నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. ఆ కుటుంబంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఆ చిన్నారిని రాకను ఓ వేడుకలా జరిపింది.

హెలికాప్టర్​లో ఇంటి..

అమ్మమ్మవాళ్ల ఊరులో ఉన్న ఆ చిన్నారిని హెలికాప్టర్​లో తీసుకురావాలని తాత మదన్​లాల్​ కుమార్​ నిర్ణయించారు. ఇందుకు జిల్లా పాలనాధికారి నుంచి అనుమతి పొందారు. అనంతరం ఆ చిన్నారిని తీసుకురావడానికి గ్రామంలో భారీ ఏర్పాట్లు చేశారు. 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆమెను రూ.4.5 లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్​లో తీసుకొచ్చారు. అప్పటికే ఊరులో బ్యాండ్​ బాజాలతో సిద్ధంగా ఉన్న బంధుమిత్రులు.. ఆ పాపకు ఘన స్వాగతం పలికారు. రామనవమి శుభసందర్భంగా గ్రామంలో అడుగుపెట్టిన తల్లి, కుమార్తెపై పూలు జల్లుతూ.. ఇంటికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి రాకను ఓ ఉత్సవంలా నిర్వహించారు.

"నా కుమార్తెను హెలికాప్టర్​లో తీసుకొచ్చాను. ఆడపిల్ల పుట్టుకను ఓ పండుగలా జరపాలనే సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేశాను"

- హనుమాన్​ రామ్​ ప్రజాపత్, చిన్నారి తండ్రి

ఇదీ చూడండి: 8 రోజుల్లోనే కొవిడ్ ఆస్పత్రి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.