ETV Bharat / bharat

ఆర్మీ చీఫ్​గా మనోజ్ పాండే- తొలిసారి ఇంజినీర్​కు సైన్యం బాధ్యతలు - army chief general manoj pande

Indian Amry chief: భారత సైన్యం తదుపరి సారథిగా లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ పాండేను నరవాణే వారసుడిగా ఎంపిక చేసింది.

new army chief in india
ఆర్మీ చీఫ్​గా మనోజ్ పాండే- తొలిసారి ఇంజినీర్​కు కీలక బాధ్యతలు
author img

By

Published : Apr 18, 2022, 6:29 PM IST

Updated : Apr 18, 2022, 7:13 PM IST

Indian Amry chief: లెఫ్టినెంట్ జనరల్​ మనోజ్ పాండే.. భారత సైన్యం 28వ సారథిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్​ జనరల్ నరవాణే ఏప్రిల్​ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాండేను ఆయన వారసుడిగా ఖరారు చేసింది కేంద్రం. కార్ప్స్​ ఆఫ్​ ఇంజినీర్స్​ నుంచి ఆర్మీ చీఫ్​ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్​ కోసం పాండేతోపాటు జై సింగ్ నయన్, అమర్​దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లు పరిశీలించింది కేంద్రం. వీరిలో పాండే అత్యంత సీనియర్. లెప్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ప్రస్తుతం ఆర్మీ​ వైస్ చీఫ్​గా ఉన్నారు. ఈయన మే 1న ఆర్మీ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

లెప్టినెంట్ జనరల్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఈయన 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌ విభాగంలో నియమితులయ్యారు. తన 39 ఏళ్ల సర్వీస్​లో కొంతకాలం జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పల్లన్​వాలా సెక్టార్​లో ఇంజనీరింగ్ రెజిమెంట్​కు నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్ పాండే వెస్ట్రన్ థియేటర్‌లో ఇంజనీర్ బ్రిగేడ్, నియంత్రణ రేఖ వెంబడి పదాతిదళ బ్రిగేడ్, లద్ధాఖ్ సెక్టార్‌లోని పర్వత విభాగం, ఈశాన్య భాగంలో కార్ప్స్‌కు నాయకత్వం వహించారు. ఆపరేషన్ పరాక్రమ్​లోనూ పాలుపంచుకున్నారు.

ఇదీ చదవండి: మోదీ నయా ట్రెండ్.. గురువారం ఎర్రకోట నుంచి ప్రసంగం

Last Updated : Apr 18, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.