NEET PG 2024 : జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్షను జులై 7కు రీషెడ్యూల్ చేశారు. మార్చి 3న ఈ పరీక్ష నిర్వహిస్తామని తొలుత అంచనా తేదీని ప్రకటించగా- పరీక్షను జులై 7కు మార్చుతున్నట్లు 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెడికల్ సైన్సెస్' స్పష్టం చేసింది. ఈ పరీక్షకు అర్హత సాధించేందుకు కటాఫ్ తేదీని 2024 ఆగస్టు 15గా నిర్ణయించింది.
2019 నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఎండీ/ఎంఎస్ సహా పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ కోసం అర్హతగా నీట్-పీజీ పరీక్షను నిర్వహిస్తున్నారు. పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ప్రతిపాదించిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(ఎన్ఈఎక్స్టీ- నెక్స్ట్) అమలులోకి వచ్చేంత వరకు నీట్ కొనసాగనుంది.
'సున్నాకు తగ్గించిన కటాఫ్'
NEET PG Medical Counselling 2023 : నీట్ (NEET 2023) పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ కొన్నాళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్‌లో సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల అర్హత మార్కులను సున్నా (0)గా పేర్కొంది. ఈ తగ్గింపు అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇదివరకటి కటాఫ్ మార్కులను సున్నాకు తగ్గించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో సీట్ల కోసం విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెల్లడించింది. కటాఫ్ మార్కులను తొలగించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామని స్పష్టం చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామని వివరించింది.
2023 విద్యా సంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు కటాఫ్ మార్కులను 291గా, దివ్యాంగులకు 274, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257గా పేర్కొని మొదటి రెండు రౌండ్‌లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా మూడో రౌండ్‌లో అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (విద్యార్థులు నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.