కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా(పరిహారం) (Covid death compensation) అందించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు(Supreme court news) తెలిపింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)(NDMA guidelines) సిఫార్సు చేసినట్లు పేర్కొంది.
కరోనా బాధితులకు.. సేవలు అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు(Covid-19 deaths) కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఎక్స్గ్రేషియా సహాయం.. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(ఎస్డీఆర్ఎఫ్) (State Disaster Relief Funds) నుంచి రాష్ట్రాలే చెల్లిస్తాయని స్పష్టం చేసింది.
కొవిడ్ మరణ ధ్రువీకరణపై.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్(ICMR covid) మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం (Covid death compensation) అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. అన్ని పత్రాలు సమర్పించిన 30 రోజుల్లోగా సొమ్ము అందుతుందని పేర్కొంది.
బాధితులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, కావాల్సిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు వాటిని తనిఖీ చేస్తారు. జిల్లా కమిటీలో కలెక్టర్, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. పరిహారం చెల్లింపులపై ఈ కమిటీయే సిఫార్సు చేస్తుంది.
జూన్ 30న తీర్పులో.. కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై 6 వారాల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని ఎన్డీఎంఏను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితిని సుప్రీంకు వివరించింది కేంద్రం.
ఇదీ చూడండి: 'ఎన్డీఏ' పరీక్షకు ఈ ఏడాది నుంచే మహిళలకు అనుమతి