NDA Meeting In Delhi : భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశలో.. NDA కూటమి కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తోందని పేర్కొన్నారు. NDAను ఓడించేందుకు విపక్షాలు ఏకమైన వేళ.. దిల్లీలో భాజపా బల ప్రదర్శన నిర్వహించింది. పాత మిత్రులకు ఆహ్వానం పలికేందుకు భాజపా నేతృత్వంలో ఏర్పాటు చేసిన NDA భేటీకి 38 పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం N రంగస్వామి, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నీఫియు రియో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో ఎన్డీఏ నేతలు మోదీని సత్కరించగా, సమావేశం అపారమైన సంతోషాన్ని ఇస్తోందని.. ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ ఏర్పాటు కాలేదన్న ప్రధాని.. దేశంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకే వచ్చిందని వివరించారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే.. దేశ ప్రగతి మార్చగలదని పేర్కొన్నారు. స్థిర ప్రభుత్వం వల్లే.. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని వివరించారు. వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ మారుతోందని అశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ 50 శాతం సంపాదింస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
-
"NDA will secure over 50 pc vote share in 2024”: PM Modi
— ANI Digital (@ani_digital) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/FdU4eYZlcL#PMModi #NDAMeeting #NDA #BJP pic.twitter.com/SSAhoLC4WE
">"NDA will secure over 50 pc vote share in 2024”: PM Modi
— ANI Digital (@ani_digital) July 18, 2023
Read @ANI Story | https://t.co/FdU4eYZlcL#PMModi #NDAMeeting #NDA #BJP pic.twitter.com/SSAhoLC4WE"NDA will secure over 50 pc vote share in 2024”: PM Modi
— ANI Digital (@ani_digital) July 18, 2023
Read @ANI Story | https://t.co/FdU4eYZlcL#PMModi #NDAMeeting #NDA #BJP pic.twitter.com/SSAhoLC4WE
"ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయింది. ఈ 25 ఏళ్లలో దేశ ప్రగతికి మార్గం చూపడం, క్షేత్రస్థాయి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషిచేసింది. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి అనే నినాదంతో ఎన్డీయే నిరంతరం పనిచేసింది. వచ్చే 25 ఏళ్లలో భారత్ భారీ లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకుసాగుతోంది. అభివృద్ధి చెందిన భారతదేశం, ఆత్మనిర్భర్ భారత్‌యే ఈ లక్ష్యం. కోట్లాది మంది భారతీయులు ప్రస్తుతం నూతన సంకల్పంతో, నవోత్సాహంతో నిండి ఉన్నారు. ఈ మహత్తర కాలంలో ఎన్డీయే పాత్ర చాలా కీలకం. ఒకవైపు నూతనోత్సాహంతో నిండి ఉన్న మూడు శక్తులు ఉన్నాయి. అందులో ఎన్ ద్వారా నవ భారతం కోసం, డీ ద్వారా అభివృద్ధి చెందిన దేశం కోసం, ఏ ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. దేశంలో పేద, మధ్యతరగతి, యువకులు, మహిళలు, దళితులు, గిరిజనులు సహా అందరి విశ్వాసం ఎన్డీయేపై ఉంది."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎన్డీఏ అంతా ఒక్కటే.. చిన్నా పెద్దా తేడా లేదు..
ఎన్డీఏపై దేశంలోని అన్ని వర్గాలకు పూర్తి నమ్మకం ఉందని మోదీ వివరించారు. ప్రతి ఒక్కరూ దేశ పునర్నిర్మాణంలో తమవంతు పాత్ర పోషించాలని చెప్పారు. ఎన్డీయే దేశ ప్రజలందరి భావనలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ నిజాయితీగా వ్యవహరించిందన్న మోదీ.. ప్రతికూల రాజకీయాలు చేయలేదని పేర్కొన్నారు. దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా విదేశాల సాయం కోరలేదంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని మోదీ విమర్శించారు. పెద్ద పార్టీ ,చిన్న పార్టీ అనే తేడాలు ఎన్డీయే కూటమిలో ఉండవని ఆయన వెల్లడించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. కూటమిలోని పార్టీలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఎన్డీయే కూటమి వివిధ పార్టీల సహకారంతో నడుస్తోందని ఇందులో బలవంతపు పోకడలకు ఆస్కారం లేదని వివరించారు.
-
#WATCH I assure you that I will leave no stone unturned in my hard work, efforts...Mere shareer ka haar kann, mere samay ka har shan, desh ko hi samarpit hai. (Every particle of my body, every moment of my time is dedicated to the country): Prime Minister Narendra Modi in Delhi pic.twitter.com/zUTy3Z2ZDl
— ANI (@ANI) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH I assure you that I will leave no stone unturned in my hard work, efforts...Mere shareer ka haar kann, mere samay ka har shan, desh ko hi samarpit hai. (Every particle of my body, every moment of my time is dedicated to the country): Prime Minister Narendra Modi in Delhi pic.twitter.com/zUTy3Z2ZDl
— ANI (@ANI) July 18, 2023#WATCH I assure you that I will leave no stone unturned in my hard work, efforts...Mere shareer ka haar kann, mere samay ka har shan, desh ko hi samarpit hai. (Every particle of my body, every moment of my time is dedicated to the country): Prime Minister Narendra Modi in Delhi pic.twitter.com/zUTy3Z2ZDl
— ANI (@ANI) July 18, 2023
గాంధీ, అంబేడ్కర్ మార్గంలో..
జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్, రామ్‌మనోహర్ లోహియా సూచించిన మార్గంలో ఎన్డీయే కూటమి నడుస్తోందని మోదీ అన్నారు. ఓటర్ల తెలివితేటలను ప్రతిపక్షాలు తక్కువ అంచనా వేస్తున్నాయన్నారు. రాజకీయాల్లో కేవలం పోటీతత్వం మాత్రమే ఉంటుందని చెప్పిన ప్రధాని.. అది శత్రుత్వంగా మారకూడదని అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు నేటి ప్రతిపక్షం.. అధికార పక్షాన్ని దుర్భాషలాడటమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా దేశాన్ని ఉంచుతామని మోదీ పునరుద్ఘాటించారు. 2024లోనూ ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రపంచ దేశాలకు కూడా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా, బ్రిటన్, యూఏఈ తదితర దేశాలు ఎన్డీఏ ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని వాళ్లకు తెలుసని మోదీ వివరించారు.
-
#WATCH | In politics, there can be competitiveness but not enmity. Unfortunately, today opposition has made it its identity to abuse us. We always kept India above all political interests. It is the NDA govt that conferred Bharat Ratna on Pranab da. NDA also conferred the Padma… pic.twitter.com/jKwxJkr72U
— ANI (@ANI) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | In politics, there can be competitiveness but not enmity. Unfortunately, today opposition has made it its identity to abuse us. We always kept India above all political interests. It is the NDA govt that conferred Bharat Ratna on Pranab da. NDA also conferred the Padma… pic.twitter.com/jKwxJkr72U
— ANI (@ANI) July 18, 2023#WATCH | In politics, there can be competitiveness but not enmity. Unfortunately, today opposition has made it its identity to abuse us. We always kept India above all political interests. It is the NDA govt that conferred Bharat Ratna on Pranab da. NDA also conferred the Padma… pic.twitter.com/jKwxJkr72U
— ANI (@ANI) July 18, 2023