ఛత్తీస్‌గఢ్‌లోని కిరండోల్-విశాఖ రైల్వే మార్గంపై మావోయిస్టులు దాడి చేశారు. జిర్కా అటవీ ప్రాంతంలోని కమలూర్-భాన్సీ (Naxalite Attack in Chhattisgarh Today) మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారు. దీంత ఆ మార్గంలో వస్తున్న ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఐదు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి (Naxalite Attack in Chhattisgarh Today) సుమారు 12.30కు జరిగినట్లు తెలుస్తోంది.
అదే కారణం..
ఇటీవల పోలీసులు కాల్పుల్లో మృతిచెందిన నక్సల్స్‌కు నివాళిగా (Naxalite Attack in Chhattisgarh Today) శనివారం బంద్‌ను ప్రకటించారు మావోలు. ఈ క్రమంలో పోలీసుల చర్యలకు ప్రతీకారంగా ట్రాక్‌ను ధ్వంసం చేసి.. రైలు ఇంజిన్‌కు భారత్ బంద్‌కు పిలుపునిస్తూ బ్యానర్‌ను కట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ధ్వంసమైన ట్రాక్‌ను పునర్ధరించే దిశగా అధికారులు చర్యుల చేపట్టరు. ట్రాక్ ధ్వంసం కావడం వల్ల ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
సర్పంచ్ భర్త హత్య..
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పర్శాగావ్‌లో బిర్జురాం అనే వ్యక్తిని మావోలు హత్య చేశారు. మృతుడిని పర్శాగావ్ సర్పంచ్ భర్తగా గుర్తించారు. దీంతో పాటు మావోయిస్టులు జేసీబీ, బైకును తగులబెట్టారు. రహదారి నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : అతడి కోసం పోలీస్ స్టేషన్‌ను పేల్చేసిన నక్సల్స్