పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో ఆ రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ(మాజీ క్రికెటర్) భేటీ అయ్యారు. కీలక శాఖను సీఎం తొలంగించారనే నెపంతో గతంలో రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలిగిన సిద్ధూ.. తాజాగా సమావేశంలో మళ్లీ మంత్రివర్గంలో చేరికపై చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రి వ్యవసాయక్షేత్రంలో నలభై నిమిషాలపాటు జరిగిన ఈ తేనీటి సమావేశం తాలూకు చిత్రాలను సీఎం మీడియా సలహా దారు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అమృత సర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధూ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలపై అధికార ప్రకటన వెలువడలేదు.
ఇదీ చూడండి: వాజేను 'మహా' సర్కారే కాపాడుతోంది: ఫడణవీస్