ETV Bharat / bharat

South China Sea: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌కు సవాల్‌!

భారత్‌, ఫిలిప్పీన్స్‌ నౌకాదళాలు దక్షిణ చైనా సముద్రంలో (South China Sea) యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో భారత్ ఇక్కడా విన్యాసాల్లో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Navies of India and Philippines conduct military drills in South China Sea
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌కు సవాల్‌!
author img

By

Published : Aug 24, 2021, 10:52 AM IST

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో (South China Sea) భారత్‌, ఫిలిప్పీన్స్‌ నౌకాదళాలు సోమవారం యుద్ధవిన్యాసాలు నిర్వహించాయి. ఐదు రోజుల కిందట ఇదే సాగరంలో వియత్నాంతో మన నేవీ యుద్ధ క్రీడలు చేపట్టింది. చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో వీటికి ప్రాధాన్యం ఏర్పడుతోంది.

ఫిలిప్పీన్స్‌తో విన్యాసాలకు భారత్‌ తరఫున గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ రణ్‌విజయ్‌, గైడెడ్‌ మిసైల్‌ కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ కోరాలు పాల్గొన్నాయి. ఫిలిప్పీన్స్‌ నేవీకి చెందిన బీఆర్‌పీ ఆంటోనియో లూనా నౌకా పాల్గొంది. ఈ సందర్భంగా సముద్రంలో రెండు నౌకాదళాలు పరస్పరం మరింత సమన్వయంతో సాగేలా ఈ విన్యాసాలు సాగాయి. దక్షిణ చైనా సముద్రంలోని తూర్పు భాగాన్ని పశ్చిమ ఫిలిప్పీన్‌ సాగరంగా ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం పరిగణిస్తోంది. అయితే ఆ సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తోంది. అక్కడ భారీగా ఉన్న చమురు, సహజవాయు నిక్షేపాలపై కన్నేసింది. వియత్నాం, ఫిలిప్పీన్స్‌, బ్రునై వంటి దేశాలు చైనా వాదనను వ్యతిరేకిస్తున్నాయి.

ఇదీ చూడండి: అత్తారింటిపై కోపంతో టీలో విషం కలిపి ఇచ్చిన కోడలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.