ETV Bharat / bharat

'నేషనల్​ ఐకాన్'​గా సచిన్ తెందుల్కర్.. ఈసీతో ఒప్పందం.. ఏం చేయాలంటే.. - సచిన్ తెందుల్కర్​ భారత ఎన్నికల సంఘం నేషనన్​ ఐకాన్​

Sachin Tendulkar National Icon of Election Commission of India 2023 : భారత ఎన్నికల సంఘం 'నేషనల్​ ఐకాన్'​గా.. ప్రముఖ మాజీ క్రికెట్​ ఆటగాడు సచిన్ తెందుల్కర్​ నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్​, సచిన్​ తెందుల్కర్​కు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా.. సచిన్ తెందుల్కర్​ అవగాహన కల్పించనున్నారు.

sachin-tendulkar-national-icon-of-election-commission-of-india-2023-ec-appoints-sachin-tendulkar-as-national-icon
భారత ఎన్నికల సంఘం నేషనన్​ ఐకాన్​గా సచిన్
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 5:26 PM IST

Sachin Tendulkar National Icon of Election Commission of India 2023 : ప్రముఖ మాజీ క్రికెట్​ ఆటగాడు సచిన్ తెందుల్కర్​ను 'నేషనల్​ ఐకాన్'​గా.. నియమించింది భారత ఎన్నికల సంఘం. ఎన్నికల పక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా.. అవగాహన కల్పించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు సచిన్.

దీనికి సంబంధించి జాతీయ ఎన్నికల కమిషన్​, సచిన్​ తెందుల్కర్​కు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ అగ్రిమెంట్​లో భాగంగా.. మూడేళ్ల పాటు ఓటర్లలో అవగాహన కల్పించనున్నారు ఈ క్రికెట్​ లెజెండ్. ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం, తెందుల్కర్​ సంయుక్తంగా కృషి చేస్తారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటింగ్​పై నిర్లక్ష్యం వహిస్తున్న వేళ.. వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. సచిన్​ పేరుప్రఖ్యాతల కారణంగా యువతపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈసీ విశ్వాసంతో ఉంది. దీంతో రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పక్రియలో యువత​ ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.

ఎన్నికల్లో ఓటింగ్​ శాతం పెంచేందుకు ప్రసిద్ధి చెందిన వ్యక్తులను 'నేషనల్​ ఐకాన్'గా​ నియమిస్తుంది ఎన్నికల కమిషన్​. ప్రజలు ఓటింగ్​ పక్రియలో పాల్గొనేలా వీరి ద్వారా అవగాహన కల్పిస్తుంది. 2022లో పంకజ్ త్రిపాఠీని నేషనల్​ ఐకాన్​గా నియమించింది ఎన్నికల సంఘం. 2019 లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఎమ్​ఎస్​ ధోనీ, ఆమిర్​ ఖాన్​, మేరీ కోమ్​ 'నేషనల్​ ఐకాన్​'గా వ్యవహరించారు.

94 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య.. 1951తో పోలిస్తే ఆరు రెట్లు పెరుగుదల..
ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు చేరిందని కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 1951లో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల శాతం ఆరు రెట్లు ఎక్కువని ఈసీ వివరించింది. సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 94,50,25,694 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. కాగా ఈ మొత్తం ఓటర్లలో సుమారు 31.50 కోట్ల మంది ఓటర్లు గత 2019 లోక్​సభ ఎన్నికల ఓటింగ్​కు దూరంగా ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. వీరిలో ఎక్కువ శాతం మంది ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, యువతతో పాటు వలస వెళ్లిన వారే ఉన్నారని ఈసీ తన నివేదికలో పేర్కొంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Rakhi For Soldiers : సైనికులకు 27 అడుగుల స్పెషల్​ రాఖీ.. 21 మంది వీరజవాన్ల చిత్రాలతో..

Rajinikanth Yogi Feet : యోగి కాళ్లు మొక్కడంపై రజనీ రియాక్షన్​​.. అందుకే అలా చేశానంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.