బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా జేడీయూ అగ్రనేత నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. నితీశ్ ఇంట్లో జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం దక్కించుకున్నారు నితీశ్ కుమార్. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం హాజరయ్యారు.
ముఖ్యమంత్రిగా సోమవారమే నితీశ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రిగా భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎన్డీఏలో జేడీయూతో పాటు భాజపా, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం), వికాస్ శీల్ ఇన్సాన్(వీఐపీ) పార్టీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా.. భాజపా 74 సీట్లతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 43 చోట్ల గెలుపొందింది. నితీశ్ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని తొలి నుంచి చెబుతున్న భాజపా.. తాజాగా లాంఛనంగా ఆయనను నాయకుడిగా ఎన్నుకుంది.