Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలతో మమేకమై, వారి కష్టాల తెలుసుకుని, కన్నీళ్లు తుడుచేందుకు ఈ జనవరి 27న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు.
Special Story on Lokesh Yuvagalam Padayatra: నేడు పాదయాత్ర ముగించే సమయానికి లోకేశ్ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు నడవనున్నారు. కుప్పంలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది. పోలీసుల్ని ప్రయోగించి, అవరోధాలు సృష్టించి, అక్రమ కేసులు పెట్టి నానా యాగీ చేసింది. చాలా చోట్ల వైఎస్సార్సీపీ నాయకులూ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లోకేశ్ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు.
3వేల కిమీ మైలు రాయిని అధిగమించిన యువగళం - పైలాన్ ఆవిష్కరణలో పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ, దేవాన్ష్
తొలి రోజుల్లో ఇలా: స్టాన్‌ఫోర్డ్ వంటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించిన లోకేశ్, తొలి రోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు సమయం వెచ్చించారు. కార్యకర్తలకు బీమా వంటి కొత్త విధానాల రూపకల్పనలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలని కలిసినప్పటికీ ఇంతగా మమేకమయ్యే అవకాశం ఆయనకు గతంలో ఎప్పుడూ రాలేదు.
అవే లోకేశ్‌ను నాయకుడిగా రాటుదేల్చాయి: మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడిచి, ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం లోకేశ్‌కు కలిగింది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్‌ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయి.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ: పెద్ద పెద్ద గోతులు నిండిన రోడ్లు, కరవుతో బీళ్లుబారిన పొలాలు, భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు, రైతన్న దైన్యం, కూలీల ఆవేదన, ఉపాధి లేక తల్లడిల్లుతున్న యువత, సమాజంలోని బలహీన వర్గాల బాధలు, దగాపడ్డ వర్గాల నైరాశ్యం ఇలా ప్రతి ఒక్కరి సమస్యల్ని తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర ఒక వేదికైంది.
Lokesh Yuvagalam @ 2000: యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి.. లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు
విరామం లేకుండా: నందమూరి తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప విరామం లేకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. పార్టీ వ్యవహారాలతోపాటు, దిల్లీ వెళ్లి న్యాయవాదులతో సంప్రదించడం వంటి బాధ్యతల వల్ల ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పొదలాడ వద్ద పాదయాత్రకు విరామం పలికారు. 79 రోజుల విరామం తర్వాత నవంబరు 27న మళ్లీ పొదలాడ నుంచే పాదయాత్రను పునఃప్రారంభించారు.
ఎన్ని అవరోధాలు సృష్టించినా వెనుకడుగే వేయకుండా: తొలుత జీవో నెం.1ని చూపించి ప్రభుత్వం పాదయాత్రకు అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు పోలీసులు మొత్తం 25 కేసులు నమోదు చేయగా, వాటిలో మూడు లోకేశ్‌పై నమోదయ్యాయి. ప్రచార రథం, సౌండ్‌సిస్టమ్, మైక్, స్టూల్ సహా అన్నింటినీ సీజ్ చేశారు. పీలేరులో బాణసంచా కాల్చారని అక్కడి ఇంఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహా పలువురిపై మూడు కేసులు నమోదు చేశారు.
పోరాట యోధుడిలా ముందుకు సాగుతూ: భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు వంటి చోట్ల వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తిరిగి 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాలతో ఉన్నవారు సహా 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. యువగళాన్ని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లురువ్వడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. అయినా వెనుకడుగేయని లోకేశ్ పోరాట యోధుడిలా ముందుకు సాగుతూ పాదయాత్ర కొనసాగించారు.
Nara Lokesh Yuvagalam 200 Days : లక్ష్యం దిశగా.. శరవేగంగా..! 200 రోజుకు చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర
అవినీతిని బయటపెడుతూ, అరాచకాలపై యుద్ధం చేస్తూ: అభిమానంతో తనను కలిసేందుకు వచ్చిన వారిని నిరుత్సాహపరచుకుండా చిరునవ్వుతో వారితో సెల్ఫీలు దిగిన లోకేశ్, తెలుగుదేశం హయాంలో తెచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌లూ విసిరారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ, అరాచకాలపై యుద్ధం చేశారు.
ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తానని భరోసా: పాదయాత్ర మధ్యలో దళితులు, యువత, రైతులు, సర్పంచ్‌లు, ముస్లిం మైనారిటీలు, మిషన్ రాయలసీమ పేరుతో మేధావులు, ప్రముఖులు, మహాశక్తి’ పేరుతో మహిళలు, బీసీలు, వైసీపీ బాధితులు, అమరావతి రైతులు, హలో లోకేశ్ పేరుతో యువత, గిరిజనులతో వివిధ సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట కాలంలోనే ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు.
ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా ? వైసీపీలో సీట్ల మార్పుపై లోకేశ్ ఎద్దేవా!
సాయం అందిస్తూ: లోకేశ్ కలిసిన వారి సమస్య తీవ్రతను బట్టి కొందరికి వ్యక్తిగతంగా సాయం అందించారు. అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత వర్గానికి చెందిన రాములమ్మ అనే మహిళ లోకేశ్ ముందు విలపించారు. వారి పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానని లోకేశ్ రాములమ్మకు హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దళిత రైతు రంగమ్మకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మునిరాజమ్మ అనే మహిళలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాక ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఆ ప్రాంతానికి ఒక వరం ప్రకటిస్తూ, దాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చి వెంటనే పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారు.
అదే సెంటిమెంట్‌తో ముగింపు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు లోకేశ్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించనుంది.
Nara Lokesh with Mahila Sakthi: అధికారంలోకి వచ్చాక.. మహిళను వేధించిన వారిని వదలం: లోకేశ్