Nara Bhuvaneshwari started Medical Camp: నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి నారా బ్రాహ్మణి క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు బహుమతులు, పండ్లు అందజేశారు. రెండు రాష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సైతం శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాణం చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మెగా హెల్త్ క్యాంప్: ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన పాటించిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తోందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలు, మెగా హెల్త్ క్యాంప్ ని భువనేశ్వరి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు పంచిన నారాభువనేశ్వరి అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి ఎన్టీఆర్ వర్ధంతి రోజున నిర్వహిస్తున్న లెజెండరీ బ్లడ్ క్యాంప్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్ : పురందేశ్వరి
ఎన్టీఆర్‌కు నారా బ్రాహ్మణి నివాళి: నట సార్వభౌముడు ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నారా బ్రాహ్మణి నివాళులు అర్పించారు. ఆస్పత్రికి వచ్చిన బ్రాహ్మణి ఆస్పత్రి ప్రాంగణంలోని బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలకు ట్రస్టు బోర్డు సభ్యులు జె యస్ ఆర్ ప్రసాద్ , ఆస్పత్రి సిబ్బందితో కలిసి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కొడాలి హరిత నేతృత్వంలోని సోషల్ వర్కర్స్ విభాగం ఆద్వర్యంలో క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు బహుమతులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలతో బ్రాహ్మణి ప్రత్యేకంగా మాట్లాడి వారిలో ఉత్తేజాన్ని నింపారు.
'తారకరాముడు నవరసాలకు అలంకారం - నవయువతకు మార్గదర్శనం'
లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పేరుతో రక్తదాన శిబిరాన్నిఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రక్తం దానం చేయటానికి ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుభాష్ణమ్మ, పలువురు వైద్యలతో కలసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వెయ్యి యూనిట్లకు పైగా రక్తం సేకరించే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు.
గుడివాడలో "రా కదలి రా" బహిరంగ సభకు తరలుతున్న టీడీపీ శ్రేణులు- ఆంక్షలు విధిస్తున్న పోలీసులు