ETV Bharat / bharat

మైసూరు దసరా ఉత్సవాల ఏనుగు మృతి- 'అర్జున'కు కన్నీటి వీడ్కోలు - హస్సన్​ జిల్లాలో దసరా ఏనుగు అర్జున మృతి

Mysuru Dussehra Elephant Arjuna Died : మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారీ మోసే అర్జున అనే ఏనుగు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. సోమవారం అడవి ఏనుగుతో పోరాడతూ అర్జున మృతి చెందింది.

Mysuru Dussehra Elephant Arjuna Died
Mysuru Dussehra Elephant Arjuna Died
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 9:56 AM IST

Updated : Dec 6, 2023, 12:55 PM IST

మైసూరు దసరా ఉత్సవాల ఏనుగు 'అర్జున'కు అంత్యక్రియలు - అడవి ఏనుగుతో పోరాడుతూ మృతి!

Mysuru Dussehra Elephant Arjuna Died : కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారి మోసే అర్జున ఏనుగుకు ఘనంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో హస్సన్​ జిల్లా సకలేశ్​పుర తాలుకాలోని దమ్మనకట్టే ప్రాంతంలో నిర్వహించారు. కడసారి అర్జునను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు.

సకలేశ్​పుర తాలుకాలోని యసలూరు సమీపంలో సోమవారం ఏనుగులకు రేడియో కాలర్​ను అమర్చే ఆపరేషన్​లో అర్జున పాల్గొంది. అందులో భాగంగా ఓ అడవి ఏనుగుతో పోరాడతూ అర్జున మృతి చెందింది. అర్జునను చూసుకుంటున్న మావటి ఏనుగుపై పడి బోరున విలపించాడు. దీంతో అతడు అస్వస్థతకు గురికావటం వల్ల వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అర్జున ప్రత్యేకత..
అర్జున ఏనుగు 1968లో జన్మించింది. మైసూర్​లో నిర్వహించే దసరా ఉత్సవాల్లో 22 సార్లు పాల్గొంది. 2012 -2019 మధ్య జరిగిన ఉత్సవాల్లో 750 కిలోల చాముండేశ్వరి దేవి బంగారు అంబారీని మోసింది. దసరా ఉత్సవాల్లోనే కాదు వందలాది ఫారెస్ట్ ఆపరేషన్స్​లోనూ పాల్గొంది. ఈ నేపథ్యంలో అర్జున సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మైసూరు దసరా సందర్భంగా అర్జునుడి పేరు మీద మవాటిలకు అవార్డు ఇవ్వాలని కర్ణాటక విధాన పరిషత్ సభ్యుడు దినేష్ గూలిగౌడ డిమాండ్ చేశారు.

మైసూరు దసరా ఉత్సవాల ఏనుగు 'బలరామ' మృతి.. 14 సార్లు అంబారి మోసి రికార్డు..
మే నెలలో మైసూరు​ దసరా ఉత్సవాల్లో​ అంబారీని మోసే 'బలరామ' అనే ఏనుగు కూడా మరణించింది. 67 ఏళ్ల బలరామ కొంతకాలంగా క్షయవ్యాధితో ఇబ్బంది పడింది. చిక్సిత పొందుతూ మృతి చెందింది. మొదట అల్సర్ బారిన పడిన ఏనుగు తర్వాత కోలుకుంది. పది రోజుల తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికాగా పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలడం వల్ల వైద్యులు ఆ మేరకు చికిత్స అందించారు. ఎటువంటి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల అస్వస్థతకు గురైన ఏనుగు వారం రోజులకే మరణించింది. మైసూరులో జరిగే దసరా ఉత్సవాల్లో 14 సార్లు 'అంబారీ'ని మోసి ఈ ఏనుగు రికార్డు సృష్టించింది. ఉత్సవాల్లో భాగంగా 10 వ రోజు పవిత్రమైన చాముండేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని అంబారీలో మోసే బలరామ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. అర్జున, బలరామ కలిసి మైసూరులో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనేవి.

ఆలయంలో రోబోటిక్​ ఏనుగు.. ఇకపై దేవుడి ఊరేగింపు దానిపైనే

ఆస్కార్ గెలిచిన ఏనుగులకు ఫుల్​​ క్రేజ్.. టూరిస్టులు క్యూ!

Last Updated : Dec 6, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.