రైతుల సమస్యలపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్రమంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆరోపించారు. చట్టంలోని ప్రతి అంశంపై నిబంధనలవారీగా చర్చించాలని రైతులను కోరారు. 'అవును, కాదు'(ఎస్, నో) వంటి పద్ధతి వీడి, సానుకూల దృక్పథంతో చర్చలు జరపాలని రైతులను అభ్యర్థించారు. అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.
కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రభుత్వం పదేపదే చెబుతూ వస్తోందని, నేతలు ఆ హామీని నిలబెట్టుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే శిక్షిస్తారని అన్నారు రాజ్నాథ్. రైతుల ఆదాయాన్ని పెంచేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
-
The govt has repeatedly said that Minimum Support Price will continue. If leaders don’t fulfil promises in a democracy then people will punish them. We're striving to increase income of farmers: Defence Minister Rajnath Singh on being asked farmers wanting MSP written into law pic.twitter.com/feT7obykgd
— ANI (@ANI) December 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The govt has repeatedly said that Minimum Support Price will continue. If leaders don’t fulfil promises in a democracy then people will punish them. We're striving to increase income of farmers: Defence Minister Rajnath Singh on being asked farmers wanting MSP written into law pic.twitter.com/feT7obykgd
— ANI (@ANI) December 30, 2020The govt has repeatedly said that Minimum Support Price will continue. If leaders don’t fulfil promises in a democracy then people will punish them. We're striving to increase income of farmers: Defence Minister Rajnath Singh on being asked farmers wanting MSP written into law pic.twitter.com/feT7obykgd
— ANI (@ANI) December 30, 2020
'సిక్కుల సమగ్రతపై సందేహాలు లేవు'
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను నక్సలైట్లు, ఖలిస్థానీ తీవ్రవాదులుగా అభివర్ణించడాన్ని రాజ్నాథ్ తప్పుబట్టారు. రైతులపై అలాంటి ఆరోపణలు చేయకూడదని అన్నారు. సిక్కులు దేశ సంస్కృతి కాపాడుతూ వచ్చారని, జాతి ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు వారు చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. దేశం పట్ల వారి సమగ్రతపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టంచేశారు. రైతులంతా అన్నదాతలని, వారికి తలవంచి వందనం చేస్తున్నట్లు చెప్పారు.
రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామనే ప్రశ్నే ఉత్పన్నం కాదని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ నిరసనలపై ప్రధాని మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.
ఇతర దేశాల జోక్యం అవసరం లేదు
రైతుల నిరసనలు పూర్తిగా దేశ అంతర్గత విషయమేనని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఏ దేశ ప్రధాని భారత అంతర్గత విషయాలపై మాట్లాడకూడదని అన్నారు. బయటివారి జోక్యం తమకు అవసరం లేదని పేర్కొన్నారు. అంతర్గత అంశాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఏ దేశానికీ లేదని తేల్చిచెప్పారు.
-
I'd like to say about prime minister of any country that comment shouldn't be made about India's internal affairs. India doesn't require any outside interference. It's our internal matter. No country has the right to comment on our internal affairs: Defence Min on farmers protest pic.twitter.com/aw0jV8u9lP
— ANI (@ANI) December 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I'd like to say about prime minister of any country that comment shouldn't be made about India's internal affairs. India doesn't require any outside interference. It's our internal matter. No country has the right to comment on our internal affairs: Defence Min on farmers protest pic.twitter.com/aw0jV8u9lP
— ANI (@ANI) December 30, 2020I'd like to say about prime minister of any country that comment shouldn't be made about India's internal affairs. India doesn't require any outside interference. It's our internal matter. No country has the right to comment on our internal affairs: Defence Min on farmers protest pic.twitter.com/aw0jV8u9lP
— ANI (@ANI) December 30, 2020
ఇదీ చదవండి: రైతులు- కేంద్రం మధ్య నేడు ఆరోదఫా చర్చలు