Murrah Buffalo Sold for Rs 4.60 lakh In Haryana : హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పూర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డు స్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. భారీ ధర పలికినందుకు సంతోషంతో ఆ గేదె యజమాని నోట్లతో తయారు చేసిన మాలవేసి ఘనంగా వీడ్కోలు పలికాడు. దీనిని చూసేందుకు జనం అధిక సంఖ్యలో వచ్చారు. ఆ గేదె భారీ ధర పలకడానికి కారణమేంటి? దానికున్న ప్రత్యేకతల గురించి యజమాని వివరించాడు.
''ఈ గేదె రోజుకి 26 లీటర్ల పాలను ఇస్తుంది. ఈ గేదెను అంతకుముందు మా గ్రామానికి చెందిన వికాస్ వద్ద రూ.78 వేలకు కొన్నాను. ఆ తర్వాత గేదె తినే ఆహారం ఇతర విషయాలలో చాలా శ్రద్ధ తీసుకున్నాను. దానికి ఇప్పుడు 6 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఇప్పుడు మా గ్రామానికి చెందిన మల్వీంద్ర అనే వ్యక్తి రూ.4.60 లక్షలతో గేదెను కొనుగోలు చేశాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అత్యంత ఖరీదైన గేదె ఇదే"
--రణవీర్ షియోరాన్, గేేదె యజమాని
ఈ ప్రాంతంలో పశుపోషణపై ఆసక్తి పెరుగుతోంది
ఇంతకుముందు ఈ ప్రాంతంలో ముర్రా జాతి గేదెలు లేవని.. గత కొంతకాలంగా ఈ జాతి గేదెలు కనిపిస్తున్నాయన్నారు ఖాన్‌పూర్ కలాన్ కౌన్సిలర్ శివకుమార్ ఖోర్డా. ఎక్కువ మంది రైతులు, మహిళలు.. గేదెలు, ఆవుల పెంపకాన్ని ఉపాధిగా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడిప్పుడే ఇక్కడి ప్రాంతంలోని ప్రజల్లో పశుపోషణపై అవగాహణ పెరుగుతోందని.. ఈరోజు ఇంత ఖరీదైన గేదెను అమ్మడం మా ప్రాంతానికి గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.
రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు.. స్పెషల్ ఏంటంటే?
ఇటీవలె కర్ణాటక రైతుకు చెందిన ఓ దున్నపోతు అందరిని ఆకట్టుకుంది. దాని బరువు, తినే తిండి గురించి తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. మహారాష్ట్రలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు తీసుకొచ్చారు యజమాని. అక్కడకు వచ్చినవారు దాని ధర గురించి విని ఆశ్చర్యపోయారు. ఇంతకి దానికున్న ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.