ETV Bharat / bharat

ఇంట్లోనే దంపతుల దారుణ హత్య.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి - హరియాణా వార్తలు

Crime News: ఇంట్లోనే దంపతులను దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​ జిల్లాలో వెలుగు చూసింది. ఇంట్లోంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. అదే రోజు నుంచి మృతుడి మొదటి భార్య కుమారుడు కనిపించకపోవటం వల్ల అతడిపైనే అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. మరోవైపు.. హరియాణాలో గత రెండు రోజులుగా అదృశ్యమయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. గ్రామంలో ఉన్న చెరువులో విగతజీవులుగా కనిపించారు.

Crime News
Crime News
author img

By

Published : May 23, 2022, 9:26 PM IST

Couple Murder News: మహారాష్ట్రలోని ఔరంగాబాద్​ జిల్లాలో దారుణం జరిగింది. నగరానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలను వారి ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. రెండు రోజులుగా వారి ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. పోలీసుల వచ్చి పరిశీలించగా.. విషయం బయటపడింది.

ఇదీ జరిగింది.. ఔరంగాబాద్​లోని పుండ్లిక్​ నగర్​లో శ్యామ్​సుందర్ కళంత్రి అనే వ్యాపారవేత్త నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా అతడి ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించగా శ్యామ్​సుందర్‌, అతడి భార్య కిరణ్‌ కళంత్రి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే శ్యామ్​సుందర్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం అతడు తన మూడో భార్య కిరణ్​తో ఉంటున్నాడు. వీరిద్దరికి జన్మించిన కుమార్తె వైష్ణవి ఉన్నత చదువుల కోసం వేరే ఊర్లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా శ్యామ్​సుందర్​ మొదటి భార్య కుమారుడు ఆకాశ్​ కనిపించట్లేదు. దీంతో అతడిపైనే తనకు అనుమానం ఉందని శ్యామ్​ కుమార్తె వైష్ణవి పోలీసులకు తెలిపింది. ఇక పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.

చెరువులో విగతజీవులుగా.. హరియాణాలోని రేవారిలో విషాదం జరిగింది. రెండు రోజులుగా అదృశ్యమయిన తల్లీపిల్లలు.. గ్రామంలో ఉన్న చెరువులో విగతజీవులుగా కనిపించారు. స్థానికుల ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాల్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోస్లీ గ్రామంలో నివాసం ఉంటున్న సీతాదేవి (35), కుమారుడు లక్ష్య (9), కుమార్తె మనీషా (10) శనివారం అదృశ్యమయ్యారు. ముగ్గురి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం తెల్లవారుజామున కోస్లీ మఠం వెనుక ఉన్న చెరువులో మహిళ మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండడాన్ని గ్రామస్థులు చూశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే మహిళ, ఆమె ఇద్దరు పిల్లల మృతికి గల కారణాలేమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

మద్యం మత్తులో అత్తను చంపిన అల్లుడు.. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని జార్వాడ్ గ్రామంలో మద్యం మత్తులో.. అత్తను హత్య చేసిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన కిసాన్ పార్ధి(42) పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక భార్య తన కన్నవారింటికి వెళ్లిపోయింది. అయితే భార్యను తీసుకురావటానికి అత్తారింటికి వెళ్లిన కిసాన్​.. అక్కడ తీవ్రంగా గొడవపడ్డాడు. మద్యం మత్తులో కత్తితో అత్తను పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. అతడ్ని అరెస్టు చేశారు.

శిశువు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన కుక్కలు.. హిమాచల్​ ప్రదేశ్​లోని సిమ్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మెహ్లీలో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో నవజాత శిశువు మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకెళ్తున్న ఘటన స్థానికులను కలచి వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నవజాతి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: చెంబులో ఇరుక్కుపోయిన కోతి తల.. తల్లి వానరం ఏం చేసిందంటే?

తుపాకులతో ఎన్నికల ప్రచారం.. జనం హడల్​.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.