ETV Bharat / bharat

ముంబయిలో ఒక్కరోజే 8 వేల కరోనా కేసులు- బంగాల్​లోనూ.. - corona in india

Mumbai Covid Cases: భారత్​లో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క ముంబయిలోనే 8 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. బంగాల్​లో ఒక్కరోజే 6 వేలమందికిపైగా వైరస్​ సోకింది. దిల్లీలో 3194, కేరళలో 2802, కర్ణాటకలో 1187 కేసులు నమోదయ్యాయి.

Mumbai reports 8,036 new case
Mumbai reports 8,036 new case
author img

By

Published : Jan 2, 2022, 7:58 PM IST

Updated : Jan 2, 2022, 8:14 PM IST

Mumbai Covid Cases: ఓవైపు ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. భారత్​లో కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ముంబయిలో ఆదివారం ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ కావడం గమనార్హం. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Delhi corona cases: దిల్లీలోనూ కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్​ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్​ కేసులున్నాయి.

బంగాల్​లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆదివారం 6,153 మందికి వైరస్​ సోకింది.

Kerala posts 2,802 new infections

  • కేరళలో 2,802 కొత్త కేసులు.. 78 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,43,289కి చేరింది. ఇప్పటివరకు 48,113 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • కొద్దినెలలుగా దేశంలో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో.. సగం కేరళవే కావడం గమనార్హం.
  • కర్ణాటకలో వరుసగా రెండో రోజూ కొవిడ్​ బాధితుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 1187 కొత్త కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 30,09,557, మరణాలు 38,346కు చేరాయి.
  • రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై. కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని, మరోసారి లాక్​డౌన్​ కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.

ఒమిక్రాన్​..

కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది.

  • మహారాష్ట్రలో ఆదివారం 50 ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 510కి చేరింది.
  • ఒడిశాలో ఆదివారం 23 మంది ఒమిక్రాన్​ బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం ఈ తరహా కేసులు 37కు చేరాయి.
  • Kerala Omicron Cases: కేరళలో ఒమిక్రాన్​ కొత్త కేసులు 45 నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 152కు చేరింది.

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు వ్యాక్సినేషన్​ ఊపందుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు టీకా డోసుల పంపిణీ 150 కోట్లకు చేరువైంది. అర్హులైన వారిలో 90 శాతం మందికిపైగా టీకా మొదటి డోసు పొందారు.

ఇవీ చూడండి: స్కూల్​లో 85, వర్సిటీలో 13 మంది విద్యార్థులకు కరోనా

ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?

'పిల్లలకు కరోనా టీకా- ఈ విషయం మరవొద్దు'

Last Updated : Jan 2, 2022, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.