ETV Bharat / bharat

'మహా'లో 44 వేలు.. బంగాల్​లో 24 వేల కరోనా కేసులు- ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

Coronavirus Update: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 44 వేల కేసులు వచ్చాయి. బంగాల్​లో ఒక్కరోజే 24 వేల287 కొత్త కేసులు వెలుగుచూశాయి. దిల్లీలో ఆదివారం 22 వేల మందికిపైగా వైరస్​ సోకింది. ఈ నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. యూపీలో రాత్రి కర్ఫ్యూ, హిమాచల్​ ప్రదేశ్​లో స్కూళ్లు బంద్​ వంటి ఆదేశాలు జారీ చేశాయి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు.

CORONA CASES DELHI, MUMBAI
CORONA CASES DELHI, MUMBAI
author img

By

Published : Jan 9, 2022, 7:44 PM IST

Updated : Jan 9, 2022, 9:08 PM IST

Coronavirus Update: భారత్​లో ఒమిక్రాన్​ ప్రభావంతో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వైరస్​ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది.

  • మహారాష్ట్రలో ఆదివారం.. 44 వేల 388 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది మరణించారు. ముంబయిలో కొత్తగా 19 వేల 474 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో ఏడుగురు చనిపోయారు. పుణెలో మరో 4 వేలమందికిపైగా వైరస్​ బారినపడ్డారు.
  • బంగాల్​లో ఆదివారం 24 వేల 287 కొత్త కేసులు నమోదయ్యాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ పాజిటివిటీ రేటు 33.89 శాతం కావడం గమనార్హం.
  • దిల్లీలో ఒక్కరోజే 22 వేల 751 కేసులు వెలుగుచూశాయి. 17 మంది మరణించారు. ప్రస్తుతం 60 వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.
  • తమిళనాడులో నేడు 12,895 మందికి వైరస్​ సోకింది. 1808 మంది కోలుకోగా.. 12 మంది మరణించారు.
  • కర్ణాటకలో కొద్దిరోజులుగా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 12 వేల మందికి వైరస్​ సోకింది. ఇందులో ఒక్క బెంగళూరు నగరంలోనే 9 వేలమందికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.33 శాతానికి చేరినట్లు ఆరోగ్య మంత్రి కె. సుధాకర్​ వెల్లడించారు. ప్రస్తుతం 49 వేలకుపైగా యాక్టివ్​ కేసులున్నాయి.

  • కేరళలో మరో 6238 కరోనా​ కేసులు నమోదయ్యాయి. 2390 మంది కోలుకోగా.. 30 మరణాలు సంభవించాయి.
  • గుజరాత్​లో 6,275 మంది ఇవాళ వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులు 236కు చేరాయి.
  • గోవాలో 1922 కొత్త కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 25 శాతానికి సమీపించింది.

ఆంక్షలు..

  • UP Curfew: ఉత్తర్​ప్రదేశ్​లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. రాష్ట్రంలో విద్యా సంస్థలు కూడా జనవరి 16 వరకు ఆన్​లైన్​ క్లాస్​లు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ​
  • ఆంక్షలు విధించినా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మరిన్ని చర్యలకు సిద్ధమైంది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రార్థనా స్థలాలు, మద్యం దుకాణాలు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో క్రమక్రమంగా కఠిన ఆంక్షలు విధించనున్నట్లు స్పష్టం చేసింది.
  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్​ ప్రదేశ్​.. కఠిన ఆంక్షలు విధించింది.

* ప్రభుత్వ కార్యాలయాలను వారంలో ఐదు రోజులు మాత్రమే తెరవనున్నట్లు, 50 శాతం సిబ్బందితోనే నడపనున్నట్లు ప్రకటించింది.

* నైట్​ కర్ఫ్యూ అమలు.

* జనవరి 26 వరకు విద్యాసంస్థల బంద్​.

* ఇండోర్​లో 100, బహిరంగ ప్రదేశాల్లో 300 మందికి మించకుండా.. రాజకీయ, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతి.

* అత్యవసర సేవల విభాగాలకు ఆంక్షల నుంచి మినహాయింపు.

  • Tamilnadu Lockdown: తమిళనాడులో ఆదివారం లాక్​డౌన్​ అమల్లో ఉంది. ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించగా.. చెన్నైలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
  • త్రిపురలో జనవరి 10- 20 మధ్యలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. సినిమా హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, వినోద పార్కులు, బార్లకు.. 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు సాగించేందుకు అనుమతి ఇచ్చింది.
  • Puri Jagannath Temple: ఒడిశాలో ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ్​ ఆలయంలో.. దైవ దర్శనంపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. జనవరి 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనున్నట్లు పేర్కొంది.
    Shree Jagannath Temple in Odisha
    జనవరి 31వరకు పూరీ జగన్నాథ్​ ఆలయంలో దర్శనాలు బంద్​
  • ఇండిగో ఎయిర్​లైన్స్​పై ఒమిక్రాన్​ ఎఫెక్ట్​ పడింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. దాదాపు 20 శాతం విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
  • Supreme Court Corona: సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేపింది. అత్యున్నత న్యాయస్థానంలోని.. నలుగురు న్యాయమూర్తులు, దాదాపు ఐదు శాతం సిబ్బంది (150 మంది) కొవిడ్​ బారినపడ్డారు.
  • పంజాబ్​ చీఫ్​ ఎలక్ట్రోరల్​ ఆఫీసర్​ డా. కె. కరుణా రాజుకు కరోనా సోకింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదలైన మరుసటి రోజే ఆయనకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది.
  • యూపీ పీలీబీత్​ లోక్​సభ ఎంపీ, భాజపా నేత వరుణ్​ గాంధీ కరోనా బారినపడ్డారు. తనకు తీవ్రమైన కరోనా లక్షణాలు ఉన్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ కార్యకర్తలకు కూడా ప్రికాషన్​ డోసు( వ్యాక్సిన్​ మూడో డోసు) అందేలా చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు వరుణ్​ గాంధీ.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం శనివారం.. షెడ్యూల్​ విడుదల చేసింది. ఫిబ్రవరి 10- మార్చి 7 మధ్య పోలింగ్​ జరగనుండగా.. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యధికంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 327మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కొవిడ్​ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి: ప్రధాని మోదీ కీలక ప్రకటన- ఇకపై ఏటా డిసెంబర్​ 26న..

కేంద్రం కీలక నిర్ణయం- వారికి మాత్రమే వర్క్​ ఫ్రం హోం!

దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు

Last Updated : Jan 9, 2022, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.