మహారాష్ట్ర ముంబయిలో 'ఆదిపురుష్' సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ కోసం గోరేగావ్‌లోని ఓ మాల్లో భారీ స్థాయిలో నిర్మించిన సెట్లో మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని... దర్శకుడు ఓమ్ రౌత్ సహా కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.
సాయంత్ర 4.10 నిమిషాలకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.
8 అగ్నిమాపక యంత్రాలు, 6 వాటర్ ట్యాంకులతో మంటలు అదుపు చేశారు. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి: 'రక్షణ రంగ కేటాయింపుల్లో 60 ఏళ్ల రికార్డ్ రిపీట్!'