రాజ్యసభలో అధికారపక్ష డిప్యూటీ లీడర్‌గా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నియమితులయ్యారు. పెద్దల సభ అధికారపక్ష నేతగా ఇటీవలే నియామకమైన పీయూష్ గోయల్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.
పార్లమెంటరీ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న నేతగా నఖ్వీ గుర్తింపు పొందారు. ప్రధానిగా మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు.
కొవిడ్ ఉద్ధృతి, పెట్రోల్ ధరలు, రైతుల ఆందోళనపై అధికారపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు కాలుదువ్వుతున్న తరుణంలో.. నఖ్వీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: రాజ్యసభలో అధికారపక్ష నేతగా గోయల్!