ETV Bharat / bharat

'భార్యల మార్పిడి గేమ్​'కు భర్త డిమాండ్.. హోటల్​లో​ బంధించి దారుణం - మధ్యప్రదేశ్​​ భార్యల మార్పిడి న్యూస్

భార్యల మార్పిడి గేమ్​ ఆడలేదని ఓ వ్యక్తి తన భార్యతో విచక్షణారహితంగా ప్రవర్తించాడు. హోటల్​లో బంధించి హింసించాడు. అతని కుటుంబ సభ్యులు నిత్యం అదనపు కట్నం కోసం కూడా వేధించే వారని.. బాధితురాలు పోలీసులకు కంప్లైంట్​ చేసింది.

wife-swap game
భార్యల మర్పిడి గేమ్​
author img

By

Published : Oct 17, 2022, 4:58 PM IST

Updated : Oct 17, 2022, 9:07 PM IST

మధ్యప్రదేశ్ భోపాల్​లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. భార్యల మార్పిడి గేమ్​ ఆడనందున తన భర్త విచక్షణారహితంగా కొట్టాడని ఓ మహిళ పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ చేసింది. ​​రాజస్థాన్​లోని బీకానేర్ ప్రాంతంలోని ఓ​ హోటల్​లో ఈ ఘటన జరగగా..మధ్యప్రదేశ్ భోపాల్​లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..
రాజస్థాన్​ బీకానేర్​లో ప్రాంతంలో అమ్మర్​ అనే వ్యక్తి ఓ 5-స్టార్​ హోటల్​లో మేనేజర్​గా పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం బలవంతంగా తన భార్య వద్ద మొబైల్​ లాక్కుని.. ఓ హోటల్​ గదిలో బంధించాడు. తరువాత అమ్మర్​ అక్కడకు చేరుకుని.. భార్యల మార్పిడి గేమ్​ ఆడాలని కోరాడు. అందుకు నిరాకరించినందుకు ఆమెతో అసభ్యంగా మాట్లాడి.. విచక్షణారహితంగా కొట్టి బలవంతంగా శృంగారం చేశాడని అతని భార్య స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

అమ్మర్​కు మద్యం, డ్రగ్స్​ తీసుకునే అలవాట్లు ఉన్నాయని అతడి భార్య తెలిపింది. పరాయి స్త్రీలు, పురుషులతో శృంగారం చేయడం అలవాటే అని పేర్కొంది. ఈ ఫిర్యాదులో రూ. 50 లక్షలు అధిక కట్నం తన అత్త, వారి కుటుంబం తనను వేదించినట్లు వివరించింది. తనని భర్త ఎప్పుడూ సరిగా చూసుకునే వాడు కాదని.. మోడ్రన్​గా లేనంటూ కొట్టేవాడని కంప్లైంట్​లో తెలిపింది. గాయపడిన ఆమెను బంధువులు తీసుకెళ్లి.. స్టేషన్​లో కంప్లైంట్​ చేయించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు మహిళా పోలీస్​ స్టేషన్​ ఇన్​చార్జ్​ అంజనా దుర్వే వెల్లడించారు.

Last Updated : Oct 17, 2022, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.