MP Navneet Rana: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా 13 రోజుల తర్వాత భాయ్ఖలా జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం నేరుగా లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఆమెకు మెడనొప్పి కారణంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవనీత్ విడుదలైన కొద్ది గంటలకే ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా కూడా తలోజా నుంచి విడుదలయ్యారు. అనంతరం నేరుగా నవనీత్ రాణా చేరిన ఆస్పత్రికి వెళ్లారు. భర్తను చూసి నవనీత్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు.
- — Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022
">— Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022
Navneet Rana News: హనుమాన్ చాలీసా వివాదం కేసులో రెండు వారాల క్రితం రాణా దంపతులు అరెస్టయ్యారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే బుధవారమే వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ అధికారిక పత్రాలు అందని కారణంగా గురువారం విడుదల చేశారు జైలు అధికారులు. లీలావతి ఆస్పత్రిలో చేరిన నవనీత్ రాణాను భాజపా నేత, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య పరామర్శించారు.
Hanuman Chalisa controversy: ఏప్రిల్ 23న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్ చాలీసా చదువుతామని శపథం చేశారు రాణా దంపతులు. ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, దాన్ని గుర్తు చేసేందుకు ఆయన ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తాన్నారు. అయితే ఆ రోజు శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి నవనీత్ రాణా ఇంటిముందు ధర్నా చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయినా తాము వెనక్కి తగ్గబోమని రాణా దంపతులు ప్రకటించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాణికి మూడు నెలల జైలు శిక్ష