ETV Bharat / bharat

అలా చేస్తే థర్డ్ వేవ్ మనల్ని టచ్​ చేయలేదట!​ - మధ్యప్రదేశ్ మంత్రి

మధ్యప్రదేశ్‌కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్‌ ప్రకటన చర్చనీయాంశమైంది. యజ్ఞం నిర్వహిస్తే పర్యావరణం శుద్ధి అయ్యి థర్డ్‌వేవ్‌ అపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆమె అన్నారు.

mp minister, usha thakur
మధ్యప్రదేశ్ మంత్రి, కరోనా థర్డ్​ వేవ్​
author img

By

Published : May 12, 2021, 7:51 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆక్సిజన్‌ లేక, బెడ్స్‌ కొరతతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే సమయంలో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్‌ ప్రకటన చర్చనీయాంశమైంది. యజ్ఞం నిర్వహిస్తే పర్యావరణం శుద్ధి అయ్యి థర్డ్‌వేవ్‌ అపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

'పూర్వకాలంలో మహమ్మారులను అంతం చేయడానికి యజ్ఞాలు నిర్వహించేవారు. ప్రస్తుత మహమ్మారికీ అదే విరుగుడు. అందుకోసం పర్యావరణాన్ని శుభ్రం చేయాలి. అందుకు మీ సహకారం కావాలి. ఇది ఆచారమో, మూర్ఖత్వమో కాదు. యజ్ఞం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేయగలిగితే థర్డ్‌ వేవ్‌ అనేది మన ఇండియా దరి చేరదు' అని మంత్రి చెప్పుకొచ్చారు. ఇండోర్‌లో ఓ కొవిడ్‌ కేర్‌ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ జన సమూహంలో ఉన్నప్పుడు కూడా మాస్కు పెట్టకోకుండా ఆమె కనిపించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై ఆమెను ప్రశ్నిస్తే తాను వేదకాలం నాటి జీవన విధానాన్ని అవలంబిస్తానని, రోజూ హనుమాన్‌ చాలీసా పఠిస్తాను కాబట్టి కొవిడ్‌ సోకదని చెప్పడం గమనార్హం.

ఇదీ చూడండి: ఉచిత టీకా​ కోసం మోదీకి విపక్ష నేతల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.