MP man beaten: మధ్యప్రదేశ్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కుక్క పిల్ల తన ట్రక్ కింద పడడం కారణంగా అది చనిపోయింది. దీంతో ఇద్దరు యువకులు ఆ డ్రైవర్ ఇంటికి వెళ్లి అతడ్ని కొట్టారు. అవమానంతో ఆ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ రేవాలోని లంగర్ పుర్వా అనే గ్రామానికి చెందిన రాజ్కరణ్ విశ్వకర్మ అనే యువకుడి ట్రక్ కింద ఓ కుక్క పిల్ల పడి చనిపోయింది. దీంతో సందీప్ పటేల్, చోటు అనే ఇద్దరు వ్యక్తులు ఆగ్రహం చెంది ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. అవమాన భారంతో రాజ్కరణ్ తన గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే మృతుని బంధువు వాదన మరోలా ఉంది. ఇద్దరు నిందితులే రాజ్కరణ్ను కొట్టి చంపి, అనంతరం ఉరివేసినట్లు ఆరోపిస్తున్నారు.
ప్రాథమికంగా దీనిని అత్మహత్యగా నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 17ఏళ్ల బాలికను బెదిరించి.. నెలలుగా 20 మంది అత్యాచారం!