రాష్ట్రంలోని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం(Madhya Pradesh News) వినూత్న పథకాన్ని ప్రారంభించింది. మరుగుదొడ్లను ఉపయోగిస్తూ.. వ్యర్థాలను తొలగిస్తూ.. ఇంటి పరిసర ప్రాంతాల శుభ్రతకు పాటుపడే ప్రజలకు టీవీ, మొబైల్ ఫోన్లు తదితర వస్తువులను బహుమతిగా ఇస్తోంది.
ఇటీవల పైలట్ ప్రాజెక్ట్‌గా బైరాసియా గ్రామ పంచాయతీ పరధిలోని అన్ని గ్రామాల్లో శుభ్రతను పరిశీలించి.. మొత్తం 71 మందిని ఎంపిక చేశారు. వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నందుకు ఎంపిక చేసిన గ్రామాలకు చెందిన విజేతలకు మొదటి బహుమతిగా టీవీ, రెండో బహుమతిగా మొబైల్ ఫోన్, మూడో బహుమతిగా టార్చ్‌లైట్, నాలుగో బహుమతిగా గోడ గడియారం, ఐదో బహుమతిగా కుర్చీ బహుకరించారు.
ఇదీ చూడండి: