ETV Bharat / bharat

శానిటైజింగ్​ యంత్రం​గా పాత బైక్​ - కంప్రెనర్​ యంత్రంతో శానిటైజింగ్​ మెషీన్​

కరోనా విజృంభణతో శానిటైజింగ్​కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైరస్​కు భయపడి ప్రతి వస్తువును శానిటైజ్​ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే.. ఈ ప్రక్రియను మరింత సులభంగా మార్చేశాడు ఓ ఇంజినీర్​. తన నైపుణ్యంతో.. ఓ పాత ద్విచక్ర వాహనాన్ని శానిటైజింగ్​ యంత్రంగా మార్చాడు.

Sanitizer Bike, Hussafi Khan
శానిటైజర్​ బైక్​, హుస్సాఫి ఖాన్​
author img

By

Published : May 6, 2021, 1:48 PM IST

పాత​ బైక్​ను శానిటైజింగ్​ యంత్రం​గా మార్చిన ఇంజినీర్

మధ్యప్రదేశ్​లోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ ఇంజినీర్​ అద్భుత ప్రతిభను కనబర్చాడు. తన పాత మోటార్ ​బైక్​ను శానిటైజింగ్​ మెషీన్​గా మార్చాడు. ఇళ్లు, వీధులు సహా.. అన్ని ప్రాంతాల్లోనూ వాడేందుకు వీలుగా దీన్ని రూపొందించాడు హుస్సాఫి ఖాన్​.

Hussafi Khan with sanitizer bike
శానిటైజర్​ బైక్​

ఎలా చేశాడంటే?

ఖాన్ వద్ద ఓ పురాతన 'రాజ్​దుత్'​ మోటార్ ​బైక్ ఉంది. దాని వెనకభాగంలో ఇరువైపులా 60 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకర్లను, ఇంజిన్​ సమీపంలో ఒక కంప్రెషర్​ యంత్రాన్ని అమర్చాడు. బైక్ స్టార్ట్​ అవ్వగానే.. ఆ​ మెషీన్​ పనిచేసే విధంగా రూపొందించాడు. దానికి అమర్చిన పంపింగ్​ పైప్​ సాయంతో సులభంగా శానిటైజింగ్​ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ మెషీన్​ను నియంత్రించేందుకు ఎక్సిలేటర్​కు అనుసంధానించాడు ఖాన్​.

Sanitizing
శానిటైజింగ్​ చేస్తూ..

తన పాత ద్విచక్రవాహనాన్ని... ఇలా శానిటైజింగ్​ యంత్రంగా మార్చేందుకు రూ.12,000 ఖర్చయ్యాయి అంటున్నాడు ఖాన్​. ఈ బైక్​ సాయంతో ఇరుకైన వీధుల్లోకి కూడా సులభంగా వెళ్లి శానిటైజ్​ చేయవచ్చన్నాడు. ఈ ద్విచక్రవాహనాన్ని ప్రస్తుతం.. 'న్యూ యూత్​ ట్రాన్స్​ఫర్మేషన్​ సోషల్​ ఆర్గనైజేషన్​(ఎన్​యూటీఎస్​ఓ)' నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి:కరోనా రోగులకు ఆటో సేవలు- ఉపాధ్యాయుడి ఉదారత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.