ETV Bharat / bharat

కొండను తొలిచి.. బావిని తవ్వి.. భార్య కోసం భర్త భగీరథ ప్రయత్నం - మధ్యప్రదేశ్​ నీటి కొరత

నీటి కోసం భార్య పడుతున్న కష్టాన్ని చూడలేని ఓ భర్త భగీరథ ప్రయత్నం చేశాడు. మూడేళ్ల పాటు శ్రమించి కొండపైనే బావిని తవ్వాడు. గంగను పైకి తీసుకొచ్చి భార్య కష్టాన్ని తీర్చాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో జరిగింది.

mountain-man
భార్య కోసం భర్త భగీరథ ప్రయత్నం
author img

By

Published : Jun 9, 2022, 7:12 PM IST

కొండను తొలిచి.. బావిని తవ్వి.. భార్య కోసం భర్త భగీరథ ప్రయత్నం

జీవితభాగస్వాముల కష్టాలు చూడలేక కొందరు సామాన్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. బిహార్​కు చెందిన దశరథ్​​ మాంఝీ ఏకంగా కొండను తవ్వి దారి వేశాడు. ఇప్పుడు అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో జరిగింది. గుక్కెడు నీటి కోసం తన భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక సిహావల్​ గ్రామానికి చెందిన హరీ సింగ్​.. భగీరథ ప్రయత్నం చేశాడు. కొండపైనే బావిని తవ్వి గంగమ్మను పైకి తీసుకొచ్చాడు.

భగీరథ ప్రయత్నం: జిల్లాలోని సిహావల్​ గ్రామం రాజధానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మూడువేల జనాభా కలిగిన ఆ ఊరిని మంచి నీటి కొరత వేధిస్తోంది. నిత్యం కిలోమీటర్ల మేర వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామానికి చెందిన హరీసింగ్​(40).. నీటి కోసం తన భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక ఇంటి సమీపంలోనే బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అది అంత సులభమేమీ కాదు. వారు ఉండేది కొండ ప్రాంతం. అక్కడ నీళ్లు రావని ఎవరు చెప్పినా వినకుండా.. ప్రయత్నం మొదలు పెట్టాడు హరీ సింగ్​. కుటుంబ సభ్యుల సాయంతో మూడేళ్ల పాటు శ్రమించి.. 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతు బావిని తవ్వగా నీళ్లు పడ్డాయి. మరింత లోతుకు వెళ్తే గానీ సరిపడా నీళ్లు రావని, తన పనిని కొనసాగిస్తామని చెబుతున్నాడు హరీ సింగ్​.

"నీటి కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాం. రోజు 1-2 కిలోమీటర్ల దూరం వెళ్లి మంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. నా భార్య అంత దూరం వెళ్లి నీరు తెచ్చేందుకు ఇబ్బందులు పడుతోంది. ఆ కష్టాన్ని చూడలేక బావి తవ్వాలని నిర్ణయించుకుని ప్రయత్నం మొదలు పెట్టాను. మూడేళ్లు శ్రమిస్తే 60 అడుగుల లోతు వరకు వెళ్లాం. ఇప్పటికి నీళ్లు వచ్చాయి."

- హరీసింగ్​

బావి తవ్వటంలో హరీ సింగ్​ భార్య సియావతి, ఇద్దరు బాలురు, ఓ బాలిక సాయం అందించారు. బావిలోని రాళ్లను కొద్దికొద్దిగా తొలగిస్తూ నీటి జాడను కనుగొని తన భార్య కష్టాన్ని తీర్చాడు హరీ సింగ్​. మొదటి నుంచి పెద్ద పెద్ద రాళ్లను తొలుస్తూ వస్తున్నామని, చాలా కష్టంతో ఈ లోతుకు వెళ్లగలిగామని చెప్పాడు అతడు. మూడేళ్లుగా తమ కుటుంబ సభ్యులు ఈ పనిలో నిమగ్నమయ్యారని తెలిపాడు.

ఇదీ చూడండి: గుక్కెడు నీటికోసం కోటి పాట్లు.. ప్రమాదకర రీతిలో సాహసాలు!

స్మార్ట్​ సిటీలో యువకులకు పెళ్లి కష్టాలు.. నీళ్లే కారణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.