ETV Bharat / bharat

దారుణం.. ముగ్గురు పిల్లల్ని ఉరి వేసి చంపిన తల్లి.. ఆపై తానూ - Chittorgarh latest news

ముగ్గురు పిల్లలను చంపి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. రాజస్థాన్​లో చిత్తోర్​​​గఢ్​​లో ఈ ఘటన వెలుగుచూసింది. కేరళలో జరిగిన మరో ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలను ఆటోలో కూర్చొబెట్టి నిప్పంటించాడు భర్త. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

mother-killed-her-3-children
ముగ్గురు పిల్లల్ని ఉరి వేసి చంపిన తల్లి
author img

By

Published : May 5, 2022, 4:53 PM IST

Updated : May 5, 2022, 7:09 PM IST

Mother killed Children: రాజస్థాన్​ చిత్తోర్​​​గఢ్​లో దారుణం జరిగింది. కపాసన్ పోలీస్​ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను ఉరి తీసి చంపింది. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే మహిళ పిల్లలను ఎందుకు చంపి ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం కుటుంబ తగాదాల వల్లే మహిళ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.

కపాసన్ సీఐ ఫూల్​చంద్ టేలర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆర్​ఎన్​టీ కోళ్ల ఫాంలో మృతురాలు రూప, ఆమె భర్త భూరాలాల్​ ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. బుధవారం అతను పని మీద బయటకు వెళ్లాడు. రాత్రి అయ్యాక తిరిగి వచ్చి చూస్తే భార్య, ముగ్గురు పిల్లలు తలో దిక్కు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. వెంటనే భూరాలాల్​ తన యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. భార్యాభర్తలు రత్లాంకు చెందిన వారని, పనికోసం వచ్చి కపాసన్​లో నివసిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు చిన్నారుల పేర్లు శివాని(7), రితేశ్​(5), కిరణ్​(3). తల్లి వీరిని ఎందుకు చంపి ఉంటుందనే విషయం అంతుపట్టడం లేదు. పోలీసులు తల్లీబిడ్డల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్​పీ గీతా చౌదరి తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని, వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటామన్నారు.

కేరళలో..: కేరళలో గురువారం ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను గూడ్స్​ ఆటోలో ఎక్కించి ఆ తర్వాత నిప్పంటించాడు. అనంతరం తానూ ఒంటికి నిప్పంటించుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య, భర్తతో పాటు వారి 11 ఏళ్ల కుతురు చనిపోయింది. మరో ఐదేళ్ల కుమార్తె కాలిన గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. అయితే భర్త పోక్సో కేసులో నిందితుడని, ఈ ఘటనకు అదేమైనా కారణమై ఉంటుందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Mother and child found charred in a goods auto
కేరళలో దారుణం

ఇదీ చదవండి: 'ఆదిలాబాద్​కు భారీగా ఆయుధాలు.. పాక్​ కుట్ర భగ్నం.. నలుగురు అరెస్ట్'

Last Updated : May 5, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.